సికింద్రాబాద్, వెలుగు : నార్త్‌జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు మానవత్వం చాటుకున్నాడు. తాను వెళ్తున్న రూట్లో ప్రమాదానికి గురైన తల్లీకొడుకులను తన వాహనంలో హాస్పిటల్‌కు తరలించారు. మల్కాజిగిరికి చెందిన ఉషారాణి తన కొడుకు సందీప్‌తో కలిసి బైక్‌పై గురువారం మెహిదీపట్నంలోని తన బంధువుల ఇంటికి బయలుదేరారు. ఏవోసి సెంటర్ వద్దకు రాగానే, ఆమె చున్నీ వెనక టైర్లో చిక్కుకొని బైక్ నుంచి కిందపడ్డారు.
తీవ్ర గాయాలు కావడంతో వారిని అటుగా వెళ్తున్న నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీసీ శంకర్ రాజు గమనించాడు. వెంటనే తన గన్‌మెన్ ప్రసాద్, డ్రైవర్ సహాయంతో బాధితులను తన కారులో ఎక్కించుకొని దగ్గరలోని ఏడీఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో స్పందించి తమను హాస్పిటల్‌కు తరలించిన ఏసీసీకి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.