- 400 మంది కళాకారులు, 300 మంది చేతి వృత్తిదారులు
- 29 నుంచి ఈశాన్య రాష్ట్ర భారతీయ కళా మహోత్సవ్
- 28న ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
కంటోన్మెంట్, వెలుగు:బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ నెల 29 నుంచి ‘ఈశాన్య రాష్ట్ర భారతీయ కళా మహోత్సవ్’ నిర్వహిస్తున్నట్లు నిలయం మేనేజర్ రజిని తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను బుధవారం రాష్ట్రపతి నిలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓఎస్ డీ స్వాతి షాహి, ఎన్ఈహెచ్ హెచ్ డీసీ ఎండీ ఆర్కే సింగ్, ఎన్ఈజెడ్ సీసీ డైరెక్టర్ ప్రసన్న గోయ్ తో కలిసి రజిని మీడియాతో మాట్లాడారు.
ఈశాన్య రాష్ట్రాల చరిత్ర, సంస్కృతి, చారిత్రక నేపథ్యం, ఆహారపు అలవాట్లు, కళారూపాలు, చేనేత కళా ఖండాలను తెలియజేసేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని వెల్లడించారు. 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్టుదేవ్వర్మ, సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పాల్గొంటారని స్పష్టం చేశారు.
29 నుంచి వచ్చే నెల 6 వరకు కళా మహోత్సవ్కొనసాగుతుందని, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 వరకు ప్రదర్శనలు ఉంటాయన్నారు. సందర్శ కులకు ఎంట్రీ ఫ్రీ అని, ఆసక్తిగా ఉన్నవారు ముందుగా రాష్ట్రపతి నిలయం వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని, అలాగే రాష్ట్రపతి నిలయం వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్ నేరుగా ఎంట్రీ పాసులు పొందవచ్చని చెప్పారు.