హైదరాబాద్, వెలుగు: సమ్మర్ స్కూల్ ప్రోగ్రామ్‌ను అందించడానికి నార్తర్న్ అరిజోనా యూనివర్సిటీ (ఎన్‌ఏయూ), రిసాయా అకాడమీతో భాగస్వామ్యం చేసుకుంది. అమెరికాలోని ఎన్‌ఏయూ క్యాంపస్‌లో భారతీయ విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన విద్యాఅనుభవాన్ని అందిస్తామని యూనివర్సిటీ తెలిపింది. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం కూడా ఈ ఒప్పందంలో భాగమైంది.
కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇమ్మర్సివ్ మీడియాలో అత్యాధునిక కోర్సులను బోధిస్తామని ఎన్‌ఏయూ ప్రకటించింది. ఇంటెన్సివ్ సమ్మర్ ప్రోగ్రామ్.. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్లాక్‌చెయిన్, ఏఐ/ఎంఎల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) వంటి కోర్సులు చదువుతున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొంది.