ఆధ్యాత్మికం : వ్యామోహమే పెద్ద పద్మవ్యూహం.. ఆ మాయ నుంచి బయటపడలేమా..?

ఆధ్యాత్మికం : వ్యామోహమే పెద్ద పద్మవ్యూహం.. ఆ మాయ నుంచి బయటపడలేమా..?

ఒకసారి నారదమహర్షి, శ్రీ మహావిష్ణువు కలిసి సరదాగా భూలోకంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ ఈ లోకం పోకడలు, మనుషుల మనస్తత్త్వాలు, సంసారబాధల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో నారదుడు ఆసక్తిగా విష్ణుమూర్తిని ఒక ప్రశ్న అడిగాడు. ' ప్రభూ! మానవులకు ఎందుకు సంసారం మీద ఇంత ఆసక్తి? దాంట్లో ఏముంది? ఆ మాయ నుంచి బయటపడలేదా?" అనిఅడిగాడు. తన మహా భక్తుడి అంతరంగాన్ని గుర్తించిన శ్రీ మహావిష్ణువు అతనికి దీన్ని అనుభవపూర్వకంగా తెలియజెప్పాలనుకున్నాడు.

నారదా దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం! నాకు దాహమవుతోంది. ముందు కొన్ని మంచినీళ్లు తీసుకొస్తావా!?" అని అడిగాడు విష్ణుమూర్తి. దానికిం ఇప్పుడే తెస్తాను స్వామి. ఉందండి" అంటూ దూరంగా కనపడుతున్న ఒక ఇంటికి మారు వేషంలో వెళ్లాడు. ఇంట్లోనుంచి ఒక అందమైన యువతి మంచి నీళ్లు తీసుకొని వచ్చింది. ఒక్కసారిగా ఆ లోకసంచారి. ఆమె అందానికి ముగ్దుడైపోయా డు. తొలిచూపులోనే మోహంలో పడిపోయాడు. తన మనసులో మాటని ఆమె ముందుంచారు. ఆమె 'సరే' అన్నది. ఇంట్లో వాళ్లూ కూడా ఒప్పు కోవడం క్షణాల్లో అంగీకారం అయ్యింది. వెంటనే పెళ్లి చేసేశారు. అలా వారముడు గృహస్తుడయ్యాడు. దగ్గర్లో ఉన్న ఏటి ఒడ్డున ఇల్లు కట్టుకున్నాడు. భార్య, పిల్లలు, సంపాదన.. ఇలా అన్నీ వరుసగా జరిగిపోయాయి. 

ALSO READ | Good Health: ఉద్యోగులూ మీ కోసమే.. టెన్షన్ ను ఇలా చిత్తు చేద్దాం.. హెల్త్ కోసం ఇవి తినండి..!

ఫ్యామిలీ ఆలనా పాలనలో మమేకమైపోయాడు. మునసలితనంలో కూడా ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. ఇంతలో అర స్మాత్తుగా ఒకరోజు ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. భారీ వరద ఏట్ ఒడ్డున ఉన్న నారదుడి కుటీరాన్ని ముంచెత్తింది. భార్యాపిల్లలు నీళ్లలో కొట్టుకుపోతుండటంతో వారరుడు దిక్కుతోచక అరుస్తూ, ఏడుస్తున్నాడు. ఇంతలోని ష్ణుమూర్తి వారదా! నేనడిగిన మంచి నీళ్లు ఏవిక అంటూ వెనక నుంచి వీపు తట్టాడు. 'నుంచి వీళ్లేంటి?" అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నారదుడు. ఇదే సంసారం నాయనా! అంటూ నారదుడి భుజంపై చెయ్యి వేయగానే మహర్షి రూపంలోకి మారిపోయాడు నారదుడు!

భౌతిక సుఖాల వైమీ..

ఈ కథలో బాగానే పసితనం నుంచి పండు టాకులా రాలిపోయేవరకు మనుషులు ఇల్లు. పిల్లలు, సంసారం. వీటి మధ్య బొంగరాల్లా తిరుగుతుంటారు. అందుకే అది శంకరాచా రులు ఆవేదనతో ఇలా అంటారు. అవుసు! బృమంతా ఇటల్లో ఆసక్తితో, యవ్వనమంతా స్త్రీ వ్యామోహంతో, ముసలితనంలో పశ్చాత్తాపంతో జీవితాంతం గడుపుతారేతప్పు ఆ పరమాతృపై ఆసక్తి, ప్రేమను పెంచుకోలేకపోతున్నారు. వివే కహీనులై ఇంకా భౌతిక సుఖాల వైపే పిచ్చిగా పరుగులు తీస్తున్నాడు" అని,

రామచంద్రుని మాటలు 

జీవితం గురించి ఎక్కువగా ఊహించుకుంటూ, యుగయుగాలు ఇలాగే ఉండిపోతామన్న భ్రమలో మునిగి తేలుతుంటారు. అందుకే. శ్రీరామచంద్రుడు ఒకసారి తీవ్ర వైరాగ్యంతో వశిష్ఠ మహర్షితో ఇలా అంటారు.. నిజమే! ఈ ఆయువుని చూస్తేనేమో... అత్యంత పలమైంది. ఇక మరణమేమో చాలా దూరంలో, క్రూరంగా ఎదురు చూస్తుంటుంది. ఈ జీవుడేమో 'యవ్వనం' అనే అందమైన, తెలివైన మోనగత్తె ముచూసి మద, మాన గద్యాలను పొందుతూ. క్షణంలో విచక్షణ కోల్పోతున్నాడు. కానీ, యవ్వనం శాశ్వతమా? కాదు. ఇది వాస్తవానికి క్షణికం. 

ఇకచాల్యం చూద్దామా. అదిచట్టమైన అజ్ఞానంతో కప్పి ఉంటుంది. దీర్ఘంగా ఆలోచిస్తే బాల్యమంతా కల్పిత క్రీడా మయమే కదా! యవ్వనమేమో స్త్రీ సాంగత్యం, ఆహందారంతో నిండి కృశించి పోతుంది. ఇక ముసలితనం ప్రవేశించిందా. అన్నీ కష్టాలే. ఈలోపు మృత్యువు వచ్చి, బలహీనమైన శరీరాన్ని నోట కరుచుకుపో తుంది. ఇలా జనులు వ్యర్గజనులు అవుతున్నారు. అంటాడు. ఏంటి ఈ జీవితం" అని ఎన్నోసార్లు అనిపించినా మనుషులు జీవితాన్ని అలాగే నెట్టుకొస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆ పరమా త్వగుణపాఠాలు నేర్పిస్తూ, పరోక్షంగా తనవైపు మనసు మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నా.. భౌతిక విషయాల్నే అంటిపెట్టుకుంటున్నారు.

సంసారమే సర్వస్వమా?

'లోకులు భార్యాబిడ్డలకై కడివెడు కన్నీరు. కారుస్తారు. కానీ, భగవంతుడి కోసం ఎవరు విడుస్తారు. జనం దృష్టి భౌతిక వస్తువులపైనే స్థిరపడినట్టుగా కనిపిస్తుంది నాకు కోరికలతో వాళ్లంతా ఉదుకులు, పరుగులు పెడుతున్నారు.ఎవరిలోనూ భగవత్ చింతన లేదు. నిజానికి భగవంతునికి దగ్గరయ్యేకొద్దీ.. కర్యకలాపాలు తగ్గిపోతూ ఉంటాయి. భోగాసక్తిని త్యాగం చేస్తే మరణ సమయంలో భగవంతుడే గుర్తుకొస్తాడు. లేదంటే కుటుంబం, ఇల్లు, సంపర, పేరు ప్రతిష్ట లువంటి సంసార విషయాలే యాదికొస్తాయి. అందుకే భగవన్నామ గుణకీర్తనలు, ధ్యానం. చింతన సాధన చేస్తుండాలి' అని చెప్పేవాడు శ్రీరామకృష్ణ పరమహంస.

దఃఖం నుంచి దుఃఖానికే

ఈ లోకంలో భగవంతుడు తప్ప, ఆనందాన్ని ఇచ్చే వస్తువు ఇంకొకటి లేదు. ఈ సుఖాల తయారీ అంతా ఒక దుఖం నుంచి మరో దుఃఖం వైపు తీసుకెళతాయే కానీ, సులం వైపు కాదు అవి సంపాదించుకునే వరకు 'కావాలి, కావాలి' అనే ఆశ తీరా వచ్చిన పోతాయేమోనన్న భయం! ఇలా మనుషులు వాటిని అనుభవించడం లేదు. మనుషుల్నే అవి అనుభవిస్తున్నాయి. బాల్యం. యవ్వనం, ముసలితనం... ఇలా కష్టనష్టాల చక్రంలో ఇరికించి పీల్చి పిప్పి చేసి.. కాటిక్ చేరుస్తున్నాయి. అందుకే 2. శ్రీకాళహస్తీశ్వరా! పరీక్షించి చూడగా, ఈ ప్రపంచమంతా సందేహంతో కూడినదే. 

ఈ శరీరం పుట్టుక పరిశీలించి చూడాల్సిన విషయమే లోపలున్న జీవుణ్ణి చూస్తే ముఖం నుంచి మరోదుఃఖం మాదిరిగా ఒక జన్మ నుంచి మరో జన్మకు ప్రయాణించడమే! శరీరమంతా భయభ్రాంతులతో కూడుకున్నదే. పరిశీలిస్తే శరీరమంతా ఎండిపోయే విషయాలే. ఈ ప్రాణికి చివరకు మిగిలేదంతా చెడు నడవ డిజే కాబట్టి, మనుషులు నిన్ను తలిస్తే ఇలాంటి బాధలేం పొందరు కదా! అని అంటారు కవి దూర్జటి.

పరమాత్మలోనే పరమానందం

ఒకసారి భగవంతునికి ఆకర్షితులైతే.. ఈ లౌకిక విషయాలన్నీ బాధించేవేనని అర్ధమవు తుంది. పరమాత్మ అందించే పరమానందం ముందు ఈ సంసార సుఖాలు చిన్నగా కనిపిస్తా -యి. కానీ, పరమాత్మను విశ్వసించడం లేదు. సేవించడం లేదు. అందుకే ఆ పరమాత్మ అలుపె రగకుండా పరుగులు తీయిస్తోంది. తమకు తామే శరణాగతులై, అభగవంతుడిని వేరుకుంటే అన్ని బందనాల నుంచి తొలగిస్తారు కానీ, మనుషుల మనసుల్లో ఇంకా ఇల్లూ, పిల్లలు, సంసారంపై అనురాగం, మోహం మిగిలే ఉన్నాయి. 

అందుకే అందులో పడి కొట్టుకుపోతున్నారు. "మహాత్మా! నిమ్ము భక్తితో సేవించకుండా పాప కర్మలతో ప్రవర్తించే వారిని పశువులను బంధించినట్లు నామరూపాలతో బంధించి, ఏం సారసాగరంలో పడపోస్తానని శ్రీమద్భాగవతం. అంటోంది. 'ఇడనైనా, ఈ భౌతిక వ్యామోహాలు తగ్గించుకుని, మనసులో పరమాత్ముణ్ణి స్మరిం చుకుంటే ఆయన మన బాధల్ని తొలగించి, వాధ్యతను తన చేతిలోకి తీసుకుంటాడు' అని అది శంకరులు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకోవాలి.