
స్వేచ్ఛ ఉంటుంది కానీ.. దానికి కొన్ని హద్దులుఉంటాయి..భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కానీ దానికి పరిధులు ఉంటాయి..నిజానికి విలువ ఉంటుంది కానీ.. ఆ నిజం ప్రభుత్వ పక్షం అయ్యి ఉండాలి..సెన్సార్షిప్ ఉంటుంది కానీ..దానిపైనా నియంత్రణ ఉంటుంది’’ అని ఖరాఖండిగా తేల్చి చెప్పింది కేంద్రం ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా ఎలన్ మస్క్కు చెందిన సోషల్ ఫ్లాట్ ఫాం X (గతంలో ట్విట్టర్) దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రం పైవిధంగా స్పందించింది. తమకు తెలియకుండానే..మా కంపెనీ ప్రమేయం లేకుండానే..నెటిజన్ల భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధంగా X ఫ్లాట్ ఫాం, AI గ్రోక్ నుంచి కంటెంట్ ను నియంత్రించటంపై ఎలన్ మస్క్ కంపెనీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది.
వివాదానికి కారణం ఏంటీ..?
ఎలన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI టూల్ Grok.. గ్రోక్ లో భారతదేశ రాజకీయాలపై విపరీతమైన కంటెంట్ జనరేట్ అవుతుంది. గ్రోక్ ఆధారంగా రాహుల్ గాంధీ సమర్ధవంతుడు..సమర్ధుడైన ప్రతిపక్ష నేత, కాబోయే భవిష్యత్ నేత అంటూ గ్రోక్ స్పష్టం చేస్తుంది. అంతే కాకుండా రాహుల్ గాంధీ వర్సెస్ ప్రధాని మోదీ విషయంలోనూ రాహుల్ గాంధీకి ఎక్కువ మార్కులు వేస్తోంది గ్రోక్.
ALSO READ | ఇట్లయితే ఇండియాలో వ్యాపారం చేసుకోలేం..మోదీ ప్రభుత్వంపై కోర్టుకెక్కిన ఎలాన్ మస్క్!
మరోవైపు బీజేపీ పార్టీ, ప్రధాని మోదీ ప్రసంగాలు..వాస్తవాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగినప్పుడు ఎలన్ మస్క్ ఏఐ టూల్ గ్రోక్ ఇస్తున్న సమాధానాలు అన్నీ బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా మోదీ ప్రధాని కాక ముందు డాలర్ తో రూపాయి విలువ..ఇప్పుడు రూపీ విలువ ఎంత..బీజేపీ మోదీ పాలనలో ఉద్యోగాల కల్పన, ఉపాధి అవకాశాలు, కరోనా సమయంలో మోదీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రధాని మోదీ ఎన్ని పరిశ్రమలు స్థాపించారు..ఎన్ని నీటి ప్రాజెక్టులు కట్టారు.. మోదీ ఎన్ని మీడియా సమావేశాలు పెట్టారు.. రాహుల్ గాంధీ ఎన్ని సార్లు మీడియాతో మాట్లాడారు.. ఇలాంటి ఎన్నో.. ఎన్నెన్నో ప్రశ్నలకు గ్రోక్ ఇస్తున్న సమాధానాలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాయి. దీంతోపాటు ఇటీవల హిందీ యాసలో గ్రోక్ సృష్టించిన హంగామా అంతా ఇంతాకాదు.. హిందీలో ఓ యూజర్ అడిగిన ప్రశ్నలకు బండ బూతులు తిట్టడం కూడా సంచలనం అయింది.
ఈ క్రమంలోనే ఇలాంటి కంటెంట్ను Grok, X ఫ్లాట్ఫాంపై నుంచి కేంద్రం ప్రభుత్వం నియంత్రించింది. అలాంటి సమాచారాన్ని కంట్రోల్ చేసింది. గ్రోక్ను అడిగి ఎన్నో ప్రశ్నలకు సమాధానం అందుబాటులో లేదు అని వస్తుంది..నెటిజన్లు ఈ విషయాన్ని ఎక్స్ దృష్టికి తీసుకెళ్లటం..దాన్ని పరిశీలించిన ఎలన్ మస్క్ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. దీనిపై బెంగళూరు కోర్టులో పిటిషన్ వేసింది.