సైఫ్ అలీఖాన్కు రూ.36 లక్షల మెడిక్లెయిమ్.. కామన్ మ్యాన్ అయితే ఇచ్చేవారా..? డాక్టర్ సూటి ప్రశ్న

సైఫ్ అలీఖాన్కు రూ.36 లక్షల మెడిక్లెయిమ్.. కామన్ మ్యాన్ అయితే ఇచ్చేవారా..? డాక్టర్ సూటి ప్రశ్న

దుండగుని కత్తి పోట్లతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ యాక్టర్ మెడికల్ క్లయిమ్ కు సంబంధించిన సమాచారం లీకయ్యింది. సైఫ్ 35.95 లక్షల రూపాయల మెడికల్ ఇన్సురెన్స్ క్లైయిమ్ చేసుకున్నట్లు తెలిసింది. సైఫ్ యాక్టర్ .. సెలెబ్రిటీ.. ప్రభావితం చేసే వ్యక్తి కావడం చేత అతనికి ఇన్సురెన్స్ కంపెనీలు వెంటనే క్లెయిమ్ రిలీజ్ చేస్తాయి. అదే ఒక కామన్ మ్యాన్ కు అయితే కంపెనీలు ఇంత ఈజీగా క్లెయిమ్ చేసిన మొత్తాన్ని ఇస్తాయా అని ప్రశ్నించారు ముంబైకి చెందిన డాక్టర్. 

ముంబైకి చెందిన కార్డియాక్ సర్జన్ (హార్ట్ సర్జన్) డా. ప్రశాంత్ మిశ్రా ఇన్సురెన్స్ కంపెనీలకు సూటి ప్రశ్న వేశారు. మిడిల్ క్లాస్ లేదంటే పేద వాళ్లకు ఇన్సురెన్స్ కంపెనీలు ఎప్పటికీ ఇంత మొత్తాన్ని ఇవ్వవని మండి పడ్డారు. వాళ్లకు ఇచ్చే కొద్ది మొత్తం కూడా ముప్పు తిప్పలు పెట్టి ఇస్తారని అన్నారు. ముఖ్యంగా ‘నివా భూప ఇన్సురెన్స్ కంపెనీ’ ఎప్పడూ పేదలైన పాలసీ హోల్డర్లకు 5 లక్షల రూపాయలకు మించి ఇవ్వలేదని తెలిపారు. 

Also Read : ప్రమోషన్స్ షురూ చేసిన కన్నప్ప టీమ్

‘‘చిన్న ఆస్పత్రులు, సాధారణ ప్రజలకు నివా భూప (Niva Bupa) కంపెనీ ఎప్పటికీ 5 లక్షలకు మించి క్లెయిమ్ డబ్బులు ఇవ్వదు. కేవలం ఫై స్టార్ (5 స్టార్) ఆస్పత్రులకే చెల్లిస్తుంది. ఫై స్టార్ హాస్పిట్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఫీజులు వేస్తాయని, వాటికే ఇన్సురెన్స్ కంపెనీలు ఎక్కువ మొత్తంలో చెల్లిస్తాయి’’అని డా. ప్రశాంత్ మిశ్రా ఫైరయ్యారు. సైఫ్ అలీఖాన్ కు ఇవ్వడంపై తనకు ఎలాంటి ఆవేదన లేదని, కానీ బీమా కంపెనీలు పేదల విషయంలో చేసే మోసాలపై తను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. 

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్‎పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో సెలబ్రెటీలకు నిలయమైన బాంద్రాలో ఉన్న తన నివాసంలో సైఫ్ అలీఖాన్‎పై గుర్తు తెలియని నిందితుడు కత్తితో ఎటాక్ చేశాడు. బుధవారం (జవనరి 15) అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు.