Aadhar Update: ఆధార్కార్డుపై ఫొటో క్లియర్గా లేదా.. ఇలా అప్డేట్ చేసుకోండి

Aadhar Update: ఆధార్కార్డుపై ఫొటో క్లియర్గా లేదా.. ఇలా అప్డేట్ చేసుకోండి

ఆధార్ కార్డు..ప్రతి ఒక్కరికి ముఖ్యమైన ఐడెంటిటీ డాక్యుమెంట్..ఆధార్ కార్డు లేకుండా దాదాపు ఏ పని జరగదు.. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా..ప్రయివేట్ పరంగా గుర్తింపు కావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలన్నా..పిల్లలను స్కూల్ లో జాయిన్ చేయాలన్నా గుర్తింపుగా ఆధార్ కార్డు సమర్పించాల్సిందే..అటువంటి తప్పనిసరి గుర్తింపు కార్డు అయిన ఆధార్ కార్డులో ఫొటో బాగాలేకపోతే ఎలా ఉంటుంది. అలాంటి సమయంలో చాలామందికి ఆధార్డు కార్డులో ఫొటో మార్చుకోవాలి.. క్లియర్ గా ఉన్న ఫొటోను జత చేయాలని అనిపిస్తుంది. అయితే ఎలా..?ఆధార్ కార్డులో ఫొటో అప్డేట్ కు UIDAI  అవకాశం కల్పిస్తుంది. ఆధార్ కార్డులో ఫొటోను ఎలా అప్డేట్ చేసుకోవాలి.. ఏమేం డాక్యుమెంట్లు జత చేయాలి వంటి వివరాలను తెలుసుకుందాం. 

  • మొదటగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌https://uidai.gov.in లోకి ఎంటర్ కావాలి. 
  • హోమ్‌పేజీలో ఆధార్ నమోదు/నవీకరణ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోవాలి. 
  • ఎలాంటి తప్పులు లేకుండా అవసరమైన అన్ని వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి. 
  • ఫిల్ చేసిన ఫారాన్ని  తీసుకొని సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రం లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలి. 
  • బయోమెట్రిక్స్ అందించడం ద్వారా కొత్త ఫోటో ను అప్డేట్ చేసుకోవాలి. 
  • ఫారమ్‌ను ఆధార్ అధికారికి సమర్పించి, మీ బయోమెట్రిక్ వివరాలను అందించంచాలి. అక్కడికక్కడే కొత్త ఫోటో తీయబడుతుంది.

డాక్యుమెంట్లు ఎవైనా సమర్పించాలా?

మీ ఆధార్ ఫోటోను అప్‌డేట్ చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్లు జత చేయాల్సిన అవసరం లేదు. మీరు స్వయంగా ఫోటోను అప్‌లోడ్ చేయలేరు..కొత్త ఫోటో ఆధార్ కేంద్రంలో మాత్రమే తీయబడింది. ఫొటో అప్డేషన్ తర్వాత 90 రోజుల్లో మీకు ఆధార్ కార్డు అందజేయబడుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. సెల్ఫ్-సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ (SSUP) ద్వారా ఆధార్ ఫోటో అప్‌డేట్ ఆన్‌లైన్‌లో చేయబడదు.