- పాడైపోతున్న ఫుడ్ పెడుతున్నా పట్టించుకోని బల్దియా
- ఫుడ్ క్వాలిటీపై చెక్ చేయని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు
- ఆన్ లైన్ డెలివరీలపైనా ఫోకస్ పెట్టట్లేదు
- బల్దియా అధికారుల తీరుపై జనం ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: ఫుడ్ వాసన వస్తుందని.. క్వాలిటీగా లేదని.. ఫ్రిజ్‌లో పెట్టినవి వేడి చేసి డెలివరీ చేస్తున్నారని.. ఇలా సిటీలోని రెస్టారెంట్లు, హోటల్స్‌పై బల్దియాకు కంప్లయింట్లు వెళ్తున్నాయి. ఇటీవలే ఓ వ్యక్తి చికెన్ బిర్యానీలో పీస్లేదంటూ కేటీఆర్‌కు ట్విట్చేయడం వైరల్‌గా మారింది. కొద్దిరోజులుగా వీటి సంఖ్య పెరిగిపోయింది. ప్రతిరోజూ ఆన్లైన్లో 40 మంది , డైరెక్ట్‌గా 20 మంది వరకు కంప్లయింట్లు చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులుగా పెడుతుండగా.. మరికొందరు బల్దియా దృష్టికి తీసుకెళ్తు న్నారు. ఆర్నెళ్లలోనే 400పైగా ఫిర్యాదులు వెళ్లాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో వీటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. టోల్‌ఫ్రీ నంబర్ కాల్ చేస్తే సంబంధిత అధికారులు రెస్పాండ్ కావడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ఫుడ్ డెలివరీలపై కూడా కంప్లయింట్లు వెళ్తుండగా ఫుడ్‌ఇన్‌స్పెక్టర్లు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.
క్వాలిటీకి ప్రయారిటీ ఇస్తుండగా..
కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే జనాలు హోటల్ఫుడ్పై ఇంట్రెస్ట్చూపిస్తుండగా క్వాలిటీ ఫుడ్‌కు ప్రయారిటీ ఇస్తున్నారు. పార్టీలు, ఫెస్టివల్స్ టైమ్‌లో ఫ్యామిలీస్, ఫ్రెండ్స్‌తో వెళ్తుండగా హోటల్స్, రెస్టారెంట్లు సందడిగా ఉంటుంటాయి. వీకెండ్స్లోనైతే రష్ఎక్కువగా ఉంటుంది. ఫుల్ రేటింగ్ ఉన్న హోటల్స్, రెస్టారెంట్లను ఆన్లైన్లో సెర్చ్‌చేసి మరి వెళ్తున్నారు.
కంప్లయింట్ సెల్‌కు వచ్చిన వాటిని..
హోటల్స్, రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్‌లో ఎప్పటికప్పుడు చెకింగ్లు చేయాల్సిన బల్దియా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు లైట్ గా తీసుకుంటున్నారు. బల్దియా కంప్లయింట్ సెల్‌కు వచ్చిన కంప్లయింట్లను కూడా పట్టించుకోవడంలేదు. ఆన్లైన్లో వచ్చిన ఫిర్యాదులు ఏమవుతాయో కూడా తెలియదు. గ్రేటర్ లోని 30 సర్కిళ్ల లో కొత్తగా వచ్చిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో కలిపి ప్రస్తుతం 21 మంది సిబ్బంది ఉన్నారు. వీరు చెకింగ్లు చేయాలంటే డిజిగ్నేటెడ్ ఆఫీసర్ల పర్మిషన్ కంపల్సరీగా ఉండాలి. అయితే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎక్కడ కూడా తనిఖీలు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బల్దియాకు వచ్చిన కంప్లయింట్స్ చూస్తున్నారే కానీ చెకింగ్లు మాత్రం చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఆన్సర్ ఇవ్వని ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్
సిటీలో రెస్టారెంట్లు, హోటల్స్‌లో ఫుడ్చెకింగ్లు చేసే బల్దియా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ను అడిగితే.. ఎక్కడైనా ఫుడ్ బాగలేకపోతే ఆన్లైన్లో, డయల్100, 040- 21111111కు కంప్లయింట్చేస్తే యాక్షన్తీసుకుంటామని చెప్పారు. రెండు నెలల్లో ఎన్ని కంప్లయింట్లు వచ్చాయని, ఎన్ని హోటల్స్‌పై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు.