
హిట్ సీరీస్ లో వచ్చిన మూవీస్ అంటే ట్విస్ట్ లు.. యాక్షన్స్ కు పెట్టింది పేరు. శైలేష్ కొలను సృష్టించిన సస్పెన్స్ స్టోరీస్.. సక్సెస్ ఫుల్ గా రెండు పార్ట్స్ హిట్ అయ్యాయి. థర్డ్ కేస్ లో నాని నటిస్తుండటంతో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. నాని మాస్ జాతర.. హైటెన్స్ సీన్స్ చూసిన ఫ్యాన్స్.. రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.
శుక్రవారం (ఏప్రిల్ 25) ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు. ‘తను’ అనే సాంగ్ ను సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ చేసిన కామెంట్స్ ప్రేక్షకులలో హీట్ పుట్టిస్తున్నాయి.
హిట్ సీరీస్ లు అంటే కేవలం యాక్షనే కాదు.. థర్డ్ కేస్ లో రొమాన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటుందని సినిమా యూనిట్ తెలిపింది. నాని మాస్ యాక్షన్ తో పాటు రొమాన్స్ ఇరగదీశాడని టాక్. ట్రైలర్ లో కూడా కొంత క్లూ ఇచ్చారు. అయితే శుక్రవారం రిలీజ్ అవుతున్న సాంగ్ లో హాట్ పుట్టించే సీన్స్ ఉంటాయని చెబుతున్నారు. హిట్ సీక్వెన్స్ అంటే యాక్షనే కాదు.. రొమాన్స్ టచ్ కూడా గట్టిగానే ఉండాలని ప్లాన్ చేశారట.
ఇక ‘తను’ సాంగ్ విషయానికి వస్తే.. మిక్కి జే మేయర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను అనిరుధ్ అద్భుతంగా పాడినట్లు మూవీ టీమ్ చెబుతోంది. నాని, శ్రీనిధి శెట్టి మధ్య కెమిస్ట్రీని ఫిక్స్ చేయడంలో ఈ సాంగ్ బాగా హెల్పయ్యిందని తెలిపారు. చూడాలి మరి.. ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో.