అది ఢిల్లీలోని ఓ ఫేమస్ స్వీట్ షాపు..స్వీట్ప్రియులైన కస్టమర్లతో కిటకిటలాడుతోంది. ఓ పక్క స్వీటీ కొనుగోలుతో కస్టమర్లు బిజీగా ఉంటే..మరో పక్క డిస్ ప్లే కేసులో ఉంచిన స్వీట్లను రుచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాయి ఎలుకలు.ఎప్పుడు జరిగిందో తేదీగానీ, షాపు సంబంధించిన వివరాలు లేవుగానీ రసగుల్లలో స్విమ్మింగ్చేస్తున్న ఎలుక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.. ఇది చూసిన నెటిజన్లు షాపు నిర్వాహకులను ఓ రేంజ్ లో తిట్టుకుంటున్నారు.
काउंटर पर लगी मिठाई में चूहें दौड़ लगा रहे हैं, लोगों की सेहत के साथ बड़ा खेल है, लगातार ऐसे मामले सामने आ रहे हैं आखिर प्रशासन कब इन पर सख्त कार्रवाई करेगा? मामला राजधानी दिल्ली के खजूरी चौक अग्रवाल स्वीट्स का बताया जा रहा है pic.twitter.com/AZveLiNbsX
— Gagandeep Singh (@GagandeepNews) October 4, 2024
కస్టమర్లందరూ తమకు ఇష్టమైన, కావాల్సిన స్వీట్స్ఆర్డర్చేసేందుకు క్యూలో నిలబడ్డారు. ఇంతలో ఓ కస్టమర్స్వీట్స్ డిస్ప్లే కేసులో స్వీట్స్ లో ఎలుక స్విమ్మింగ్ దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అమ్మకానికి ఉంచిన స్వీట్లను ఎలుక కొరుకుతూ.. వాటిపైనే జంపింగ్, రన్నింగ్.. ఒక్కమాటలో చెప్పాలంటే అన్ని పనులు అక్కడే కానిస్తోంది.. ఈ దృశ్యాలు చూసిన కస్టమర్లకు దిమ్మతిరిగింది. దీంతో షాపు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఎలుక సాహసాన్ని, షాపు నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని చూపిస్తున్న వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా రియాక్షన్ ఇచ్చారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఇది తప్పనిసరిగా పెంపుడు ఎలుక అయి ఉంటుందని వ్యంగ్యంగా రాశారు.
Also Read :- ఛత్తీస్‌గఢ్ ఎన్ కౌంటర్
స్వీట్ల షాపులో మీరు ఇంకా ఏనుగుల్లాంటివి ఏమైనా చూడాలని ఆశిస్తున్నారా అని చమత్కరించాడు.
మరో వినియోగదారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ లేదా అని రాశారు.
స్వీటుషాపులో ఇలాంటివి కొత్తేమి కానప్పటికీ..ఎలుకగారి సాహసం..షాపువారి నిర్లక్ష్యానికి ఇటు కస్టమర్లు..అటు నెటిజన్లను స్వీట్లు తినాలా వద్దా? అనే డైలమాలో పడే శాయి. ఎప్పుడు జరిగిందో..ఎక్కడ జరిగిందో స్పష్టమైన వివరాలు లేనప్పటికీ..ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతంలో బిజీగా ఉండే ఖాజూరీ చౌక్‌లోని అగర్వాల్స్వీట్స్షాపు అని నెటిజన్లు అంటున్నారు.