అవునా నిజమా : నోకియా, శాంసంగ్ కాదు.. ఇండియాలో ఫస్ట్ మొబైల్ ఫోన్ ఇదే

ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ప్రపంచం డిజిటల్ ఎక్విప్ మెంట్ల మయం. దీంతో ప్రపంచంలో వింతలు, విశేషాలు తెలుసుకోవాలనే ఔత్సాహికుల కోరిక పెరుగుతున్న కోరిక రోజురోజుకు పెరుగుతోంది. కొందరు జ్ఞానం కోసం చేసే అన్వేషణలో వివిధ ప్లాట్ ఫారమ్ లలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇటీవల కొందరు జ్ఞానం కోసం చేసిన అన్వేషణలో ఒక ప్రశ్న అందరి దృష్టిని ఆకర్షించింది. అదే.. భారత దేశంలో మొదటి మొబైల్ ఫోన్ కంపెనీ ఏదీ?

ఈ ప్రశ్నకు నెటిజన్లు భారీగానే స్పందించారు. భారత దేశంలో మొట్టమొదటి మొబైల్ ఫోన్ కంపెనీ భారతీ ఎయిర్ టెల్ అని దీనిని గతంలో భారతి టెలీ వెంచర్ అని పిలిచేవారని ఓ నెటిజన్ సమాధానం ఇచ్చారు.. మరో నెటిజన్ మిచెల్ గేమ్స్ స్పందిస్తూ.. 1995లో స్థాపించబడిన మెడీ టెల్ స్ట్రా అని బదిలిచ్చాడు. మరొకొందరు దీనికే ఓటు వేశారు.. అయి శాంసంగ్ అని కొందరు.. నోకియా అని ఇంకొందరు నమ్మారు. 

అయితే ఈ సమాధానాలలో ఏదీ కరెక్ట్ కాదు.. భారత దేశంలో మొట్ట మొదటి సెల్ ఫోన్ కంపెనీ మోటోరోలా.1973 ఏప్రిల్3న, మోటరోలాలో ఇంజనీర్ అయిన మార్టిన్ కూపర్ మొట్టమొదటిసారిగా పబ్లిక్ కాల్ చేశారు. కాల్ చేసిన 11 సంవత్సరాల తర్వాత కంపెనీ Motorola DynaTAC 8000X పేరుతో మోడల్ బయటికి వచ్చింది. దీని (ఇప్పటి కరెన్సీ ప్రకారం)ధర దాదాపు రూ. 96,000 ($11,700) ఉంది.
ఈ మొబైల్ ఫోన్ భారతదేశంలో మొదటిసారి 1995లో ప్రవేశపెట్టబడింది. దీని పరిమాణం చాలా పెద్దది. చార్జింగ్ పూర్తిచేయడానికి దాదాపు 10 గంటలు పట్టేదట. నేరుగా 10 గంటలు ఛార్జ్ చేస్తే అరగంట పాటు దాన్ని ఉపయోగించవచ్చు. మోటరోలా తర్వాత నోకియా, శాంసంగ్ భారతీయ మార్కెట్లకు కూడా పరిచయం చేయబడ్డాయి.

Motorola DynaTAC 8000X మొట్టమొదటి వైర్‌లెస్ ఫోన్. దీని బరువు దాదాపు 790 గ్రాములు.  మొబైల్ ఫోన్ బరువు కారణంగా వినియోగదారులు దానిని తమ వెంట తీసుకెళ్లడం కాస్త ఇబ్బందిగా మారింది. సమయం గడిచేకొద్దీ కంపెనీలు పోర్టబుల్ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మరో 50 యేళ్లు పోతే మొబైల్ లేని మానవ జీవితం ఊహించడం చాలా కష్టం. మానవ జీవితం, మొబైల్ ఫోన్లు రెండు విడదీయరానివిగా మారనున్నాయని నిపుణుల విశ్లేషణ.