ఈ దేశాల్లోనూ పంద్రాగస్టు పండగే

ఇండియా ఇవాళ ఇండిపెండెన్స్​ డే జరుపుకుంటోంది. మన దేశానికి 1947 ఆగస్టు 15న ఫ్రీడం వచ్చింది. ఇది జరిగి ఇప్పటికి 72 ఏళ్లు పూర్తైంది. అయితే ఆగస్టు 15వ తేదీన ఇండిపెండెన్స్​ వచ్చిన దేశం ఇండియా ఒక్కటే కాదు. ఇలాంటివి ప్రపంచంలో మరో ఐదు దేశాలు ఉన్నాయి. అవి.. 1. కాంగో 2. నార్త్​ కొరియా 3. సౌత్​ కొరియా 4. బహ్రెయిన్​ 5. లిచ్టెన్ స్టై‌‌న్. ఈ ఐదు దేశాలు ఏ వలస పాలకుల నుంచి ఫ్రీడం పొందాయో చూద్దాం.

కాంగో:

 ఫ్రెంచ్ రూలర్స్​​ నుంచి 1960 ఆగస్టు 15న​ ఫ్రీడం పొందింది. అందువల్ల ఈరోజు 60వ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటోంది. సెంట్రల్​ ఆఫ్రికా దేశమైన కాంగోని ఫ్రెంచ్​ పాలకులు 1880లో ఆక్రమించారు. దీంతో కాంగోని తొలుత ఫ్రెంచ్​ కాంగోగా, తర్వాత మిడిల్​ కాంగోగా వ్యవహరించేవారు.​ ఫుల్​బర్ట్​ యూలూ మొదటి ప్రెసిడెంట్​ అయ్యారు. 1963 వరకు అధికారంలో ఉన్నారు.

నార్త్​ కొరియా:

జపాన్​ నుంచి 1945 ఆగస్టు 15న విముక్తి చెందింది. రెండో ప్రపంచ యుద్ధంలో ఓటమిని జపాన్​ ఒప్పుకోవటంతో కొరియన్​ ద్వీపకల్పంలో పరాయి పాలన అంతమైంది. అయితే అక్కడ స్వదేశీ పాలన ప్రారంభం కావటానికి మరో మూడేళ్లు (1948 ఆగస్టు 15 వరకు) పట్టింది. నార్త్​ కొరియా తన ఇండిపెండెన్స్​ డేని ‘లిబరేషన్​ ఆఫ్​ ది ఫాదర్​ల్యాండ్​ డే’గా జరుపుకుంటుంది.

బహ్రెయిన్​:

బ్రిటిష్​ పాలకుల నుంచి 1971 ఆగస్టు 15న ఫ్రీడం సంపాదించింది.  సమితి చేపట్టిన ఓ సర్వేలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశం తమ నేషనల్​ డే ని డిసెంబర్​ 16న జరుపుకుంటుంది. మాజీ పాలకుడు ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సింహాసనం అధిష్టించిన రోజు అదే కావటంతో డిసెంబర్​ 16న జాతీయ దినోత్సవం జరుపుకుంటారు.

 

సౌత్​ కొరియా:

ఇక్కడ అమెరికా అనుకూల ప్రభుత్వ పాలన 1948 ఆగస్టు 15న ప్రారంభమైంది. అమెరికా అధీనంలో ఉన్న ప్రాంతాన్ని, సోవియెట్​ యూనియన్​ కంట్రోల్​లో ఉన్న ఏరియానీ ఏకీకరణ చేసే ప్రయత్నం ఫెయిల్​ అయింది. దీంతో 1948లో కొరియాను సోవియట్ యూనియెన్​, యు.ఎస్. భూభాగాలుగా వేరు చేశారు. సౌత్​ కొరియాలో ఆగస్టు 15ను ‘వెలుగు తిరిగొచ్చిన రోజు’గా నిర్వహిస్తారు.

లిచ్టెన్ స్టై‌‌న్ :

అతి చిన్న దేశాల్లో ఇదొకటి. జర్మనీ నుంచి  ఇండిపెండెన్స్​ పొంది 1940 నుంచి ఆగస్టు 15ను నేషనల్​ డేగా సెలబ్రేట్​ చేసుకుంటున్నారు. ప్రిన్స్​ ఫ్రాంజ్​–జోసెఫ్​–2 పుట్టిన రోజు ఆగస్టు 16 కావటంతో ఒక్క రోజు ముందు సెలబ్రేట్​ చేసుకుంటారు.