ఢిల్లీ ఫలితాల్లో ఆప్ వెనకబడింది. ముందు నుంచి ట్రెండ్ లో బీజేపీ ముందంజలో కొనసాగుతూ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. 70 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 41 స్థానాల్లో ముందంజలో కొనసాగుతూ మ్యాజిక్ ఫిగర్ అయిన 35ను దాటేసింది. ఆప్ 29 స్థానాల్లో లీడ్ లో ఉంది.
గెలుస్తాం అనుకున్న ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఢీలా పడటంపై కాంగ్రెస్ స్పందించింది. ఢిల్లీలో ఆప్ ను గెలిపించడం తమ కర్తవ్యం కాదని కాంగ్రెస్ కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో నిజాయితీతో పనిచేశామని, తమ పార్టీని గెలిపించుకోవడమే తమ లక్ష్యమని ఆ పార్టీ స్పోక్ పర్సన్ సుప్రియా శ్రీనాతే అన్నారు.
ALSO READ | హోరాహోరీగానే ఢిల్లీ ఫలితాలు.. ఆప్ ముందుకెళుతూ.. వెనక్కి పడుతూ..
ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ కలిసి పనిచేస్తే.. గెలిచి ఉండేదని వస్తున్న కామెంట్స్ పై కాంగ్రెస్ ఈ విధంగా స్పందించింది. ఢిల్లీలో ఆప్ అతి వివ్వాసంతో ముందుకెళ్లిందని విమర్శించారు.