పెద్ద ఖర్చులను రిటర్నులో చెప్పక్కర్లేదు

పెద్ద ఖర్చులను రిటర్నులో చెప్పక్కర్లేదు

క్లారిటీ ఇచ్చిన ఐటీ డిపార్ట్‌మెంట్‌‌

న్యూఢిల్లీ: ట్యాక్స్‌‌పేయర్లు తమ ఐటీ రిటర్నుల్లో (ఐటీఆర్‌‌) హై వాల్యూ ట్రాన్సాక్షన్ల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని ఐటీ డిపార్ట్‌‌మెంట్ ‌అధికార వర్గాలు తెలియజేశాయి. ఐటీఆర్‌‌లో హై వాల్యూ ట్రాన్సాక్షన్ల వివరాలను పేర్కొనాలంటూ రూల్‌ ‌పెట్టే ఆలోచనే తమకు లేదని క్లారిటీ ఇచ్చాయి. రూ.50 వేలు మించి ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించినా, రూ.20 వేలకు పైబడి హోటల్‌‌ బిల్లు, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించినా ఇక నుంచి ఐటీఆర్‌‌లో పేర్కొనాలంటూ వార్తలు వచ్చాయి. భారీగా డొనేషన్లు కట్టినా, ఏడాదికి రూ.లక్షకు మించి విద్యాసంస్థలకు ఫీజులు చెల్లించినా రిటర్నుల్లో పేర్కొనాలంటూ నేషనల్‌‌ మీడియా రిపోర్ట్‌ చేసింది. ఇలాంటి వాటిని స్టేట్‌‌మెంట్‌ ‌ఆఫ్‌ ‌ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌‌(ఎస్‌‌ఎఫ్‌‌టీలు)గా గుర్తిస్తారని పేర్కొంది. ఐటీ చట్టం ప్రకారం థర్డ్ పార్టీలు మాత్రం హై వాల్యూ ట్రాన్సాక్షన్లను ఐటీ డిపార్ట్‌‌మెంట్‌‌కు తెలియజేయాలి. దీని వల్ల పన్నులు ఎగ్గొట్టే వారిని గుర్తిస్తారు. సాధారణంగా ఫైనాన్షియల్ ఇన్‌‌స్టిట్యూషన్లే ఇలాంటి ట్రాన్సాక్షన్ల సమాచారాన్ని ఐటీకి పంపిస్తాయని సీనియర్‌ ఆఫీసర్‌ ‌ఒకరు చెప్పారు. ఐటీఆర్‌‌లో మార్పులు చేసే ఉద్దేశం ఏదీ ప్రభుత్వానికి లేదని, మామూలుగా ఐటీఆర్‌‌లను అందజేయవచ్చని వివరించారు. చాలామంది హై వాల్యూ ట్రాన్సాక్షన్లు చేస్తూ కూడా తమ ఏడాది ఆదాయాన్ని రూ.2.5 లక్షలుగా చూపిస్తూ పన్నుఎగ్గొడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయని అన్నారు. విమానం బిజినెస్‌ క్లాస్‌ ‌లో ప్రయాణించడం, విదేశాలకు వెళడ్లం, స్టార్ హోటళ్లకు వెళడ్లం, ఖరీదైన స్కూళ్లలో పిల్లలను చేర్పించడాన్ని కూడా హై వాల్యూ ట్రాన్సాక్షన్లుగా పరిగణిస్తారు. ఇలాంటి ట్రాన్సాక్షన్లను పేర్కొనడానికి పాన్/ఆధార్‌ ‌నంబరు ఇస్తే చాలని ఐటీ చట్టం చెబుతోంది. ‘‘మనదేశంలో పన్ను కట్టే వాళ్ల సంఖ్య చాలా తక్కువ. పన్ను చెల్లించాల్సిన వారిలో చాలా మంది ఎగ్గొడుతున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే’’ అని ఐటీ డిపార్ట్‌‌మెంట్ ‌వర్గాలు చెప్పాయి. ఎవరికివారే హై వాల్యూ ట్రాన్సాక్షన్లను తెలియజేయాలని సూచించడం కంటే,థర్డ్‌ పార్టీల ద్వారా డేటా తెప్పించుకోవడం మేలని ఈ డిపార్ట్‌‌మెంట్ ‌భావిస్తోంది. క్యాష్‌‌ డిపాజిట్లు/విత్‌ ‌డ్రాయల్స్‌‌, ఆస్తుల అమ్మకం, క్రెడిట్‌ ‌కార్డుల పేమెంట్స్‌‌, షేర్లు, డిబెంచర్లు, ఫారిన్‌ ‌కరెన్సీ, మ్యూచువల్‌ ‌ఫండ్‌ ‌వంటివి కొన్న వాళ్ల వివరాలను బ్యాంకులు ఐటీ డిపార్ట్‌‌మెంట్‌కు వెల్లడిస్తున్నాయి. బ్యాంకులతో పాటు మ్యూచువల్‌‌ ఫండ్‌ ‌హౌస్‌‌లు, బాండ్లు జారీ చేసే ఇన్‌‌స్టిట్యూషన్లు ,రిజిస్ట్రార్లు, సబ్‌‌–రిజిస్ట్రార్ల దగ్గరి నుంచి సమాచారం వెళ్తుంది. గత బడ్జెట్లో కేంద్ర ఆర్థిక శాఖ 26 ఏఎస్‌ ఫారంలో మార్పులను ప్రకటించింది. వీటిలోనే ఎస్‌‌ఎఫ్‌‌టీలను చూపించాలని సూచించింది.

For More News..

ఫేస్ బుక్ కు పొలిటికల్ హీట్

ఉద్యోగం పోయి.. సొంతూళ్లలో రైతులైనరు