నోటాకు 4,440 ఓట్లు

నోటాకు 4,440 ఓట్లు

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ పార్లమెంట్​ స్థానంలో నోటాకు 4,440 ఓట్లు పడగా పోస్టల్​ బ్యాలెట్​ వచ్చిన 414 ఓట్లు చెల్లలేదు. మంగళవారం పొద్దున 8 గంటల వరకు అందిన వాటితో కలిపి 7,780 పోస్టల్, సర్వీస్​ ​బ్యాలెట్లు అందాయి. వాటిలో చెల్లని ఓట్లను తీసి కౌంటింగ్ నిర్వహించారు. ఈవీఎం మొత్తం ఓట్లు ​12,26,215 నోటా ఓట్లు వేరుగా లెక్కించారు. పార్లమెంట్​ సెగ్మెంట్లో  మొత్తం 29 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 

27 మంది డిపాజిట్​ కూడా గల్లంతు

పోటీ చేసిన వారిలో బీజేపీ క్యాండిడేట్​ అర్వింద్​ గెలవగా ఆయన సమీప ప్రత్యర్థి తాటిపర్తి జీవన్​రెడ్డి ఓడిపోయారు.  బీఆర్​ఎస్​ అభ్యరి బాజిరెడ్డి గోవర్ధన్​ సహా మిగితా 27 మందికి డిపాజిట్​ రాలేదు. ఇండిపెండెంట్​ గంటా చరితారావుకు 5,710 ఓట్లు, అలయెన్స్​ డెమొక్రటిక్​ రీఫార్మ్స్​ పార్టీ అభ్యర్థి యుగంధర్​ గట్లకు 5,453 ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్​ కోటగిరి  శ్రీనివాస్​కు 5,312, బీఎస్పీ అభ్యర్థి పుప్పాల లింబాద్రికి 4,263, ధర్మసమాజ్​ పార్టీ క్యాండిడేట్ కందెల సుమన్​​కు 3,886 ఓట్లు లభించగా మరో నలురికి నాలుగంకెల ఓట్లు పొందారు. ప్రశాంత్​ కత్రీజీ అనే ఇండిపెండెంట్​కు అందరికంటే అతి తక్కువ 284 ఓట్లు లభించాయి.