స్మార్ట్ ఫోన్ లవర్స్‌కి గుడ్‌న్యూస్ అందుతోంది. నథింగ్ ఫోన్1, 2కి కొనసాగింపుగా నథింగ్ ఫోన్ 2ఏ (Nothing Phone 2a) రాబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) వేదికగా ఈ ఫోన్ లాంఛ్ కానుందని సమాచారం. గత ఎడిషన్లతో పోలిస్తే నథింగ్ ఫోన్ 2ఏ సరికొత్త ఫీచర్లతో అలరించనుందట.
డిస్ ప్లే: నథింగ్ ఫోన్ 2ఏ 120 హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో అమోలెడ్ స్క్రీన్ ఉంటుందట. 1,084 x 2,412 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది.
ప్రాసెసర్: ది స్మార్ట్ ఫిక్స్ నివేదికల ప్రకారం.. MediaTek డైమెన్సిటీ 7200 SoC ఆధారిత చిప్‌సెట్ అందించినట్లు సమాచారం. స్పీడ్ పరంగా ఈ ప్రాసెసర్ మంచి అనుభూతినిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
కెమెరా: నథింగ్ 2ఏలో మునుపటి మోడళ్లలనే డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది. ముందువైపు 50 మెగాపిక్సెల్ Samsung S5KJN1 అల్ట్రావైడ్ కెమెరా, వెనుకవైపు 32 మెగాపిక్సెల్ సోనీ IMX615 సెన్సార్‌తో వస్తుందని వెల్లడించారు.
ధర: భారత కరెన్సీలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ. 33,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక స్టొరేజ్ విషయానికొస్తే.. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో ఈ ఫోన్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో పూర్తి వివరాలు తెలియరానున్నాయి.
Nothing Phone (2a) Specifications leaked!
— Ishan Agarwal (@ishanagarwal24) December 25, 2023
- 6.7” 120Hz AMOLED
- MediaTek Dimensity 7200
- 50MP ISOCELL S5KGN9 (used only in Moto G84 before?) + 50MP JN1 Ultrawide
- 32MP Front camera
- Avl. in India, Europe & Japan along with some other global markets
Price guess? I hope they… pic.twitter.com/MD6QJuO3q9