Nothing కంపెనీ తన మూడో స్మార్ట్ ఫోన్ Nothing Phone 2aను ఎట్టకేలకు బుధవారం (మార్చి6) ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. ఈ కామర్స్ వెబ్ సైట్ Flipkart లో అందుబాటులో ఉంది. Nothing కంపెనీ ఇండియాలో మొదటి సారిగా నిర్వహించిన గ్లోబల్ లాంచ్ ఈవెంట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ట్రాన్స్పరెంట్ డిజైన్తో, బ్లాక్, వైట్ కలర్లతో లభిస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Nothing OS 2.5 తో ఇది పనిచేస్తుంది.
ఇండియాలో మూడు రకాల RAM,స్టోరేజ్ వేరియంట్లతో అందుబాటులో ఉంది.
- 8GB+128GB స్టోరేజ్ తో దీని ధర రూ. 23,999
- 8GB+256GB స్టోరేజ్ తో దీని ధర రూ. 25,999
- 12GB+256GB స్టోరేజ్ తో దీని ధర రూ. 27,999
ఈ స్మార్ట్ఫోన్ను బ్యాంక్ ఆఫర్లతో డిస్కౌంట్లో పొందవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ. 2 వేల డిస్కౌంట్ ను అందిస్తోంది.
ALSO READ :- Health Alert: విటమిన్ డి మాత్రలతో ఎలాంటి లాభం లేదట
Nothing Phone 2a గరిష్టంగా 12GB RAM తో MediaTek డైమెన్సిటీ 7200 ప్రో చిప్ సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ అదనంగా 8GB యాడ్ చేయడం ద్వారా 20GBవరకు RAM ని పెంచుకోవచ్చు. ఇక కెమెరా విషయానిక వస్తే.. వెనకభాగంలో డ్యుయెల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో af/1.88 ఎపర్చర్ లెన్స్, 1/1.56 అంగుళాల సెన్సార్ ,ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కు మద్దతుతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉటుంది. ఇంకోటి 114 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ తో 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలకోసం 32 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1300 nits వరకు ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 5000mAh బ్యాటరీ,45 W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.