CMF ఫోన్2 ప్రో- వచ్చేసిందోచ్..ధర,ఫీచర్లు అదుర్స్

CMF ఫోన్2 ప్రో- వచ్చేసిందోచ్..ధర,ఫీచర్లు అదుర్స్

లేటెస్ట్ ఫీచర్స్, స్పెసిఫికేషనన్లు, మీ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. లాంగ్ లైఫ్ బ్యాటరీ ఉన్న  స్మార్ట్ ఫోన్ కావాలా? మంచి ఫొటో ఫీచర్స్ ఉన్న కెమెరా ఫోన్ చూస్తున్నారా.. అయితే ఇదిగో మీకోసం ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. నథింగ్ సబ్ బ్రాండ్ అయిన CMF ఇండియాలో కొత్త ఫోన్ ను విడుదల చేసింది. అదే CMF ఫోన్ 2 ప్రో. 

ఈ కొత్త మోడల్ గత జూలైలో విడుదలైన CMF ఫోన్ 1 కి అప్ గ్రేడెడ్ స్మార్ట్ ఫోన్. ఈ హ్యాండ్ సెట్ Media Tec డైమెన్సిటీ 7300 ప్రో చిప్ తో పనిచేస్తుంది. ఇందులో 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్తో అద్భుతమైన 6.77 ఇంచెస్ AMOLED డిస్ ప్లే ఆకట్టుకుంటోంది. ఛార్జింజ్ విషయంలో ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ వన్. 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వైర్డ్, వైర్ లెస్ సపోర్టు ఉంటుంది.

ధర, లభ్యత .. 

CMF ఫోన్ 2 ప్రో హ్యాండ్ సెట్ లేటెస్ట్ ఫీచర్లతో ఉన్న బడ్జెట్ ఫోన్. 8GB RAM 128GB స్టోరేజ్ తో బేస్ మోడల్  దర రూ. 18,999లు.8GB RAM 256GB స్టోరేజ్ తో బేస్ మోడల్  దర రూ.20,999లు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ నాలుగు రంగుల్లో లభిస్తోంది. మనసును ఆకట్టుకునే బ్లాక్, లైట్ గ్రీన్, ఆరెంజ్ కలర్, వైట్ కలర్లలో లభిస్తుంది.ఈ హ్యాండ్ సెట్ మే 5 నుంచి ఫ్లిప్ కార్ట్, CMF ఇండియా వెబ్ సైట్ తోపాటు వివిధ రిటైల్ షాపుల్లో కొనుగోలు చేయవచ్చు. 

ఈ హ్యాండ్ సెట్ పై  మంచి డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి.Axis, HDFC, ICICI బ్యాంక్, SBI కార్టులపై కస్టమర్ లావాదేవీలు చేస్తే వెయ్యి రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఎక్ఛేంజ్ ఆఫర్ లో మరో వెయ్యిరూపాయల తగ్గింపు పొందవచ్చు. ఆఫర్ల తర్వాత CMF ఫోన్ 2 కేవలం రూ. 16, 999 లకే లభిస్తుంది. ఈ హ్యాండ్ సెట్  ఫోన్ 2 ప్రో యూనివర్సల్ కవర్, లెన్స్ మార్పిడి, వాలెట్, స్టాండ్, లాన్వార్డ్ , కార్డ్ హోల్డర్ వంటి  యాక్సెసరీస్ లభిస్తాయి. 

CMF ఫోన్ 2 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్15 వెర్షన్ తో పనిచేస్తుంది. ఇందులో రెండు నానో సిమ్ స్లాట్లు ఉంటాయి. దీనిని  నథింగ్ ఆపరేటింగ సిస్టమ్ (OS)తో కస్టమైజ్ చేశారు.  ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచెస్, మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ను అందిస్తుంది. ఈ డివైజ్ లో ఫుల్  HD AMOLED డిస్ ప్లే,120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 

కెమెరా సిస్టమ్ విషయానికొస్తే.. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. ఇది ఫొటోగ్రఫీ ప్రియులకు మంచి ఎంపిక.  రీల్స్, సెల్ఫీలు, ఫొటోగ్రఫీపై ఆసక్తిఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. ఈ హ్యాండ్ సెట్లో50 MP మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 MP మెగాపిక్సెల్,119.5 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో టెలిఫొటో లెన్స్ ఉంటుంది.2x ఆప్టికల్ జూమ టెలిఫొటో లెన్స్,20 x డిజిటల్ జూమ్ను అందిస్తుంది. 

ఇక సెల్ఫీలకోసం 16మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీంతో మంచి రెజల్యూషన్ తో ఫొటోలను తీయొచ్చు.  ఈ హ్యాండ్ సెట్ లో ముఖ్యమైన అప్టేట్ ఏంటంటే.. కెమెరా పనితీరును మెరుగుపర్చేందుకు నథింగ్స్ ట్రూలెన్స్ ఇంజిన్ 3.0 టెక్నాలజీని ఉపయోగించారు. 

CMF ఫోన్ 2 ప్రో స్మార్ట్ ఫోన్ లో 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.   దీనిని 1TB వరకు ఎక్స్ టెండ్ చేసుకోవచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే.. WiFi6, బ్లూటూత్ 5.3, USB టైప్ C పోర్ట్ ఉన్నాయి. ఈ హ్యాండ్ సెట్ లో భద్రతపరమైన ఫీచర్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. 

CMF ఫోన్ 2 ప్రో డివైజ్ లో IP54 రేటింగ్ తో డస్ట్, వాటర్ ప్రూఫ్ పవర్ ఉంటుంది. ఇందులో రెండు మైక్రోఫోన్లు కూడా ఉంటాయి. కొత్తగా ఎసెన్షియల్ స్పేస్ ద్వారా స్క్రీన్ షాట్ లు, ఫొటోలు, వాయిస నోట్స వంటి డేటాను త్వరగా యాక్సెస్ చేయడానికి ఇది ఒక ఎసెన్షియల్ కీ ఉంటుంది. 

ఛార్జింగ్ విషయంలో ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ వన్. 5000mAh సామర్థ్యం, 33W ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కు ఈ హ్యాండ్ సెట్ సపోర్ట్ చేస్తుంది. 47 గంటల కాలింగ్ టైం, ఒకసారి ఛార్జింగ్ చేస్తే 22 గంటల Youtube స్ట్రీమింగ్ అం దిస్తుంది.ఈ ఫోన్ ఇండియన్ వేరియంట్ ఛార్జింగ్ అడాప్టర్, బాక్స్‌లో ప్రొటెక్టివ్ కేసుతో వస్తుంది.