భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఆత్మీయ సమ్మేళనాలతో ఒరిగేదేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. ఈ నెల 14న భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల మండలం నుంచి చేపట్టిన ప్రజా పోరు యాత్ర గురువారం కొత్తగూడెంలో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ప్రభుత్వం ప్రజలను మాయమాటలతో మోసం చేస్తొందన్నారు. అదానీలు, అంబానీలకు దేశ సంపదను దోచిపెడుతోందని ఆరోపించారు. జిల్లా సెక్రెటరీ ఎస్కె. సాబీర్ పాషా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య, బందెల నర్సయ్య తదతరులు పాల్గొన్నారు.