సినీ నటుడు అలీకి నోటీసులు

  • జారీ చేసిన ఏక్​మామిడి పంచాయతీ సెక్రటరీ

వికారాబాద్, వెలుగు: సినీ నటుడు అలీకి వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఏక్​మామిడి గ్రామ పంచాయతీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు.  గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 345లో అలీకి ఫాంహౌస్​ ఉంది. అలాగే, అలీ పేరిట భూమి ఉంది. అందులో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారని ఏక్ మామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి  నోటీసులు ఇచ్చారు. పంచాయతీలో అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. 

ఆ నిర్మాణాలపై ఈ నెల 5న మొదటిసారి, 22న రెండోసారి నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. ఆదివారం మరోసారి ఆ ఫాం హౌస్ లో పనిచేసే వారికి నోటీసులు అందించారు. 3  రోజుల్లో సంబంధిత పత్రాలు అందజేయాలని శోభారాణి కోరారు. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.