
హైదరాబాద్, వెలుగు: కోర్టుధిక్కరణ పిటిషన్‌లో ఇద్దరు ఐఏఎస్‌లకు హైకోర్టు నోటీసులిచ్చింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని కుమ్రంభీమ్ కలెక్టర్ వెంకటేశ్, సీసీఎల్‌ఏ నవీస్ మిట్టల్ ను కోరింది.
విచారణను ఫిబ్రవరి 14కి వాయిదా వేసింది. కుమ్రంభీమ్ అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం కొసిని గ్రామంలో కొనుగోలు చేసిన భూములను మ్యుటేషన్ చేసి, పట్టాదార్ పాస్‌పుస్తకాలను జారీ చేయాలని గతేడాది ఆగస్టు 14న ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై వెంకట నారాయణరావు అనే వ్యక్తి కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కలెక్టర్, సీసీఎల్‌లకు న్యాయమూర్తి నోటీసులిచ్చారు.