- ఓ గురుకుల టీచర్‌పై సస్సెన్షన్ వేటు
హైదరాబాద్, వెలుగు: సొసైటీ చేపట్టిన టీచర్ల ప్రమోషన్లను, ట్రాన్స్ఫర్లను తప్పుబడుతూ మాసబ్ ట్యాంక్ లోని ఎస్సీ గురుకుల సెక్రటరీ చాంబర్ ముందు ధర్నా చేసిన గురుకుల టీచర్లకు నోటీసులు అందాయి. 142 మంది టీచర్లకు ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఆదేశాల మేరకు ప్రిన్సిపాళ్లు నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి గురుకుల టీచర్విజయ నిర్మలను ఏకంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.
317జీవో బాధితులు, డిస్ లోకేట్అయిన గురుకుల ఉపాధ్యాయులను రాత్రికి రాత్రే రిలీవ్ చేసి, గ్రీవెన్స్ నిర్వహించకుండానే 177మందికి పోస్టింగ్ ఇచ్చారని టీచర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 21న ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి చాంబర్ముందు బైఠాయించి, నిరసన తెలిపారు. అంతటితో ఆగకుండా ప్రజాభవన్‌కు చేరుకొని నిరసన తెలిపారు. దీనిపై ఆగ్రహించిన సెక్రటరీ అలుగు వర్షణి.. టీచర్ విజయ నిర్మలను సస్పెండ్చేయడంతోపాటు 142మందికి నోటీసులను జారీ చేయాలని సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.