రూల్స్ పాటించని.. సికింద్రాబాద్లో 15 మెడికల్​షాపులకు నోటీసులు

రూల్స్ పాటించని.. సికింద్రాబాద్లో 15 మెడికల్​షాపులకు నోటీసులు

సికింద్రాబాద్, వెలుగు:రూల్స్​ కు విరుద్ధంగా నడుస్తున్న రాష్ట్రంలోని 15 ప్రైవేట్ మెడికల్​షాపులకు డ్రగ్​కంట్రోల్​ఆఫీసర్లు మంగళవారం షోకాజ్​నోటీసీలు జారీ చేశారు. ఇచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

వీటిలో సికింద్రాబాద్​గాంధీ ఆసుపత్రి ఆవరణలోని 3, ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలోని 5, నిలోఫర్ ఆసుపత్రి ఆవరణలోని 2, పేట్లబురుజు మెటర్నీ ఆసుపత్రి ఆవరణలో ఒకటి, వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలోని3, కరీంనగర్​ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని 3 మెడికల్​షాపులు ఉన్నాయి.