ఎన్నికల ట్రైనింగ్​కు గైర్హాజరైన 75 మందికి నోటీసులు

నిర్మల్, వెలుగు : రెండో విడత రెండ్రోజుల ఎన్నికల శిక్షణకు గైర్హాజరైన 75 మంది ఉద్యోగులకు ఆర్డీఓ, సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారుల ద్వారా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండో విడత శిక్షణలో భాగంగా మే 1న పీఓ, ఏపీఓలకు బాసర ట్రిపుల్​ఐటీలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి  25 మంది, నిర్మల్ నియోజకవర్గంలో సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో జరిగిన శిక్షణా కార్యక్రమానికి  ఇద్దరు

  ఖానాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఏడుగురు చొప్పున మొత్తం 34 మంది గైర్హాజరైట్లు పేర్కొన్నారు. మే 2న పీఓ, ఏపీఓలకు జరిగిన శిక్షణ కార్యక్రమాలకు ముథోల్ నియోజకవర్గంలో 26 మంది,  నిర్మల్ లో 8 మంది,  ఖానాపూర్ నియోజకవర్గంలో  ఏడుగురు చొప్పున మొత్తం 41 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. షోకాజ్ నోటీసులు జారీ అయిన 75 మంది శుక్రవారం సరైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు.