తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పోలీసులు నోటీసులు ఇచ్చారు. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సోమవారం పోలీసులు నోటీసులు ఇష్యూ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆయనకు నోటీసులు పంపారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రిపోర్స్ ఆధారంగా బీఆర్ఎస్ లీడర్ చిరుమర్తి లింగయ్యకు పోలీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నవంబర్ 11న (సోమవారం) జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతన్నతో పలుమార్లు చిరుమర్తి లింగయ్య ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు అధికారులను మాత్రమే ఈ కేసులో విచారించగా.. మొదటిసారి రాజకీయ పార్టీలకు సంబంధం ఉన్న వ్యక్తికి నోటీసులు అందాయి. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఆసక్తికరంగా మారింది.
2009లో నకిరేకల్ ఎస్సీ నియోజకవర్గంలో కాంగ్రెసు పార్టీ తరుపున పోటిచేసి గెలుపొందాడు. 2011లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చిరుమర్తి లింగయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు శాసన సభ్యత్వానికి రాజీనామా చేశాడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం చేతిలో ఓడిపోయాడు ఆయన. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి వేముల వీరేశాన్ని ఓడించారు. తర్వాత ఆయన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీలో చేరారు.