ఖమ్మం జిల్లాలో ఆయూర్ రక్ష హాస్పిటల్ కు నోటీసులు

ఖమ్మం జిల్లాలో ఆయూర్ రక్ష హాస్పిటల్ కు నోటీసులు

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మం నగరంలోని జమ్మిబండ సెంటర్ లో కేరళ ఆయుర్వేద వైద్యం పేరుతో గతేడాదిగా ఎలాంటి అనుమతులు లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నారని  ఆయూర్ రక్ష హాస్పిటల్ కు డిప్యూటీ డీఎం హెచ్ వో సైదులు నోటీసులు జారీ చేశారు. హాస్పిటల్ ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

హాస్పిటల్ కు, ఫార్మసీకి ఎలాంటి అనుమతి లేదని గుర్తించారు. సంబంధిత వైద్యులు కూడా లేకపోవడం గమనార్హం. హాస్పిటల్ నిర్వాహకులు పర్మిషన్ కోసం అప్లై చేసి కేవలం వారం రోజులే అవుతోందని అధికారులు చెప్పారు. ఈ తనిఖీలో వైద్య ఆరోగ్యశాఖ ఆపీసర్​ ఉపేందర్ ఉన్నారు.