ట్రిపుల్ ఆర్ సౌత్ డీపీఆర్ తయారీకి  డిసెంబర్ 30న మళ్లీ నోటిఫికేషన్​

ట్రిపుల్ ఆర్ సౌత్ డీపీఆర్ తయారీకి  డిసెంబర్ 30న మళ్లీ నోటిఫికేషన్​

హైదరాబాద్, వెలుగు: రీజినల్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్డు (ట్రిపుల్ ఆర్) సౌత్ పార్టుకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్‌‌‌‌) తయారు చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవగా, కన్స ల్టెన్సీల నుంచి స్పందన కరువైంది. ప్రభుత్వం గత నెల 25న ఇంటర్నేషనల్‌‌‌‌ కాంపిటేటివ్‌‌‌‌ బిడ్డింగ్‌‌‌‌ విధానంలో టెండర్లను ఆహ్వానించిం ది. టెండర్ల దాఖలుకు నిర్దేశించిన గడువు శుక్రవారం మధ్యాహ్నం 3గంటలతో ముగిసిం ది. నిబంధనల ప్రకారం శుక్రవారమే టెండర్లను ఓపెన్ చేయాల్సి ఉండగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆర్అండ్ బీ అధికారులు శనివారం టెండర్లను ఓపెన్ చేశారు. అయితే, ఒక్క టెండర్ కూడా రాలేదని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో మరోసారి టెండర్లు పిలిచేందుకు రీకాల్ పేరుతో ఈ నెల 30న నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. న్యూఇయర్, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో 14 రోజుల గడువు ఇస్తామని పేర్కొన్నారు. కాగా, డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ కంపెనీని ఎంపిక చేసేందుకు ఈ నెల 6న ఆర్అండ్ బీ అధికారులు ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించారు. దీనికి దాదాపు 12 కంపెనీలు హాజరయ్యాయి. డీపీఆర్ తయారీ చేసే కంపెనీ టర్నోవర్ రూ.10 వేల కోట్లు ఉండాలని క్వాలిఫి కేషన్​లో ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వంనిర్దేశించిన క్వాలిఫికేషన్ తగ్గించాలని, టెండర్ దాఖలుకు గడువు పెంచాలని కంపెనీల ప్రతినిధులు కోరారు. ఈ విషయాల ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.