సింగరేణిలో 327 పోస్టులకు నోటిఫికేషన్​ 

సింగరేణిలో 327 పోస్టులకు నోటిఫికేషన్​ 

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్​ జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్‌‌‌‌ కేడర్‌‌‌‌/ నాన్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ కేడర్‌‌‌‌లో 327 ఖాళీలు భర్తీ కానున్నాయి. 

పోస్టులు : మొత్తం 327 పోస్టుల్లో మేనేజ్‌‌‌‌మెంట్ ట్రైనీ (ఇ & ఎం), ఈ2 గ్రేడ్: 42, మేనేజ్‌‌‌‌మెంట్ ట్రైనీ (సిస్టమ్స్), ఇ2 గ్రేడ్: 7, జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (జేఎంఈటీ), టి & ఎస్‌‌‌‌ గ్రేడ్ -సీ: 100, అసిస్టెంట్ ఫోర్‌‌‌‌మెన్ ట్రైనీ (మెకానికల్), టి & ఎస్‌‌‌‌ గ్రేడ్- సీ: 9, అసిస్టెంట్ ఫోర్‌‌‌‌మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్), టి & ఎస్‌‌‌‌ గ్రేడ్ -సీ: 24, ఫిట్టర్ ట్రైనీ, కేటగిరీ-I: 47, ఎలక్ట్రీషియన్ ట్రైనీ, కేటగిరీ-I: 98 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్‌‌‌‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్‌‌‌‌) ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు అయిదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్ ​: రిక్రూట్‌‌‌‌మెంట్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 29 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.scclmines.com వెబ్​సైట్​లో సంప్రదించాలి.