5,204 స్టాఫ్​ నర్స్​ల పోస్టులకు నోటిఫికేషన్​

5,204 స్టాఫ్​ నర్స్​ల పోస్టులకు నోటిఫికేషన్​
  • జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు అప్లికేషన్లు
  • కాంట్రాక్టు, ఔట్​సోర్సింగ్​ నర్స్​లకు వెయిటేజ్​

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూట్స్‌‌‌‌లో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్స్‌‌‌‌ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అప్లికేషన్ ఫీజు రూ.120, ఎగ్జామ్‌‌‌‌ ఫీజు రూ.500 ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే చెల్లించాలని తెలిపింది. బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌‌‌‌వైఫరీకోర్సులు పూర్తి చేసి, నర్సింగ్ కౌన్సిల్​లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నోళ్లు ఈ పోస్టులకు అర్హులని పేర్కొంది. 

ఏజ్ 44 ఏండ్ల లోపు ఉండాలి. ఇన్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌, ఎక్స్‌‌‌‌‌‌‌‌ సర్వీస్, ఎన్‌‌‌‌‌‌‌‌సీసీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. రాత పరీక్ష, వెయిటేజీ పాయింట్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరగనుంది. ప్రభుత్వ దవాఖాన్లు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్ట్, అవుట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ బేసిస్‌‌‌‌‌‌‌‌లో పని చేస్తున్న నర్సులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. ట్రైబల్ ఏరియాలో పని చేసిన ప్రతి ఆర్నెళ్లకు 2.5 మార్కుల చొప్పున, మిగతా ప్రాంతాల్లో పని చేసిన ప్రతి ఆర్నెళ్లకు 2 మార్కుల చొప్పున వెయిటేజీ ఇస్తామని నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. వెయిటేజీ పొందాలంటే నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నాటికి కనీసం 6 నెలల సర్వీస్ పూర్తి చేసుకొని ఉండాలి. కాంట్రాక్ట్ , అవుట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియన్స్ సర్టిఫికెట్లను కంపల్సరీగా అప్లికేషన్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయాలి. సర్వీస్ ఎక్కువ కాలం ఉన్నప్పటికీ, గరిష్టంగా 20 మార్కులు మాత్రమే వెయిటేజీగా ఇస్తారు. 

సిలబస్‌‌‌‌‌‌‌‌లో మార్పులు..

ఎగ్జామ్ సిలబస్‌‌‌‌‌‌‌‌లో బోర్డు మార్పులు చేసింది. గతంలో చేసిన రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో జనరల్ నాలెడ్జ్‌‌‌‌‌‌‌‌, హిస్టరీ తదితర సబ్జెక్టుల నుంచి కూడా ప్రశ్నలు అడిగారు. కంప్యూటర్ బేస్డ్‌‌‌‌‌‌‌‌గా ఎగ్జామ్ పెట్టారు. ఈసారి మాత్రం పూర్తిగా నర్సింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన సిలబస్‌‌‌‌‌‌‌‌ నుంచే ప్రశ్నలు ఉంటాయని, ఓఎంఆర్ షీట్‌‌‌‌‌‌‌‌పై ఆన్సర్స్‌‌‌‌‌‌‌‌ గుర్తించాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. సిలబస్‌‌‌‌‌‌‌‌లో 20 చాప్టర్లు ఉన్నాయి. చాప్టర్లు, సబ్ చాప్టర్ల వారీగా ఏమేం ఉంటాయో నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో పొందుపర్చారు. ఈ 20 చాప్టర్ల నుంచి 80 ప్రశ్నలను ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌లో ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌లో మాత్రమే ఉంటాయని నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. ఈ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన మార్కులు, వెయిటేజీ కలిపి మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.

4 జిల్లాల్లోనే ఎగ్జామ్ సెంటర్లు..

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 వేల మంది స్టాఫ్ నర్స్ పోస్టులకు అప్లై చేస్తారని అంచనా వేస్తున్నారు. కానీ హైదరాబాద్, వరంగల్‌‌‌‌‌‌‌‌, ఖమ్మం, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో మాత్రమే ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయని నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి పెద్ద జిల్లాల నుంచి వేల మంది అప్లై చేస్తారు. ఆ జిల్లాల్లో అసలు ఎగ్జామ్ సెంటర్లు పెట్టకపోవడం గమనార్హం. ఆదిలాబాద్ అభ్యర్థులు ఎగ్జామ్ రాయడానికి సుమారు వంద కిలోమీటర్లు ప్రయాణించక తప్పదు. 


జోన్ల వారీగా పోస్టుల వివరాలు
జోన్    పోస్టులు 
 1             526
 2             831
 3             417
 4             813
 5             506
 6            1,294
 7            736
(నోట్: ఎంఎన్‌‌‌‌‌‌‌‌జేలోని 81 పోస్టులకు అందరూ అర్హులే)


డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌                                                పోస్టులు
హెల్త్ డైరెక్టరేట్                                              3,823
వైద్య విధాన పరిషత్                                        757
ఎంఎన్‌‌‌‌‌‌‌‌జే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌                                           81
డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజెన్స్‌‌‌‌‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌    8
మైనారిటీస్‌‌‌‌‌‌‌‌ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ      127
బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్  ఎడ్యుకేషనల్ సొసైటీ    197
ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ  74
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ   124
రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ    13