తెలంగాణ రాష్ట్రంలో 633 ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: మొత్తం 633 పోస్టుల్లో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్
ఎడ్యుకేషన్: 445 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్: 185 పోస్టులు, ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్: 2 పోస్టులు ఉన్నాయి.
అర్హత: డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డీ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. వయసు 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.31,040- రూ.92,050 చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్షకు 80 మార్కులు, మిగిలినవి వెయిటేజీ కింద కలుపుతారు. అభ్యర్థులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద, అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేసిన వారికి వెయిటేజీ కింద 20 పాయింట్లు కేటాయిస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.500 చెల్లించాలి. రాత పరీక్ష నవంబర్ 30న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.mhsrb.telangana.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.