కాళోజీ యూనివర్సిటీలో ఎండి హోమియో వైద్య సీట్ల భర్తీకి ప్రకటన

కాళోజీ యూనివర్సిటీలో ఎండి హోమియో వైద్య సీట్ల భర్తీకి ప్రకటన

ఎండీ హోమియో వైద్య సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లకు కాళోజి నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ హోమియో కోర్సులో యాజమాన్య కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల నమోదు చేసిన వన్ టైం ఆప్షన్ల ద్వారా అన్ని విడతల కౌన్సిలింగ్ లకు సీట్ల కేటాయింపులు జరుపనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ నెల 22వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 23వ తేదీన సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మరింత  సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఇవాళ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపాయి.