ఏకలవ్య గురుకులాల్లో అడ్మిషన్స్​ 

ఏకలవ్య గురుకులాల్లో అడ్మిషన్స్​ 

 

రాష్ట్రంలోని 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో 2023–-24 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో అడ్మిషన్స్​కు నోటిఫికేషన్​ రిలీజ్​ అయింది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్య, శిక్షణ అందిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 20లోగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అర్హతలు: ఆరో తరగతిలో అడ్మిషన్స్​కు 2022-–23 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. 7, 8, 9 తరగతుల్లో ప్రవేశానికి వరుసగా 6, 7, 8 తరగతుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష(పట్టణ ప్రాంతం), రూ.లక్షన్నర(గ్రామీణ ప్రాంతం) మించరాదు.

సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష, రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఆరో తరగతికి 100 మార్కులకు ఎగ్జామ్​ ఉంటుంది. మెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎబిలిటీ(50 ప్రశ్నలు), అర్థమెటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(25 ప్రశ్నలు), లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(తెలుగు- 25 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. 7, 8, 9 తరగతులకు 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(10 ప్రశ్నలు), రీజినల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(తెలుగు- 10 ప్రశ్నలు), మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(30 ప్రశ్నలు), సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(30 ప్రశ్నలు), సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(20 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.

దరఖాస్తులు: ఏప్రిల్​ 20 వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. రాత పరీక్ష మే 7న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.fastses.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.