ప్రభుత్వగురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్​

ప్రభుత్వగురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్​

వికారాబాద్, వెలుగు: ప్రభుత్వ గురుకులాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు ఆన్ లైన్​లో దరఖాస్తులు చేసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.2025–26 విద్యా సంవత్సరంలో వివిధ గురుకులాల్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం ఫిబ్రవరి 23న కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తుందన్నారు. 

ఆసక్తి గల అభ్యర్థులు https://tgcet.cgg.gov.in ద్వారా ఫిబ్రవరి ఒకటో తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుకు క్యాస్ట్, ఇన్​కమ్, ఆధార్, బర్త్ సర్టిఫికెట్ నంబర్​తోపాటు ఫొటో అవసరమన్నారు. 

ఈ ధ్రువీకరణ పత్రాల సత్వర జారీ కోసం కలెక్టరేట్​లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.