ఎంప్లాయిమెంట్ కల్పించడంలో ముందుండే కోర్సుల్లో యానిమేషన్ & VFX ఒకటి. ప్రస్తుతం ఈ కోర్సులకు ఫుల్ డిమాండ్ ఉండి. లక్షలు పెట్టి ప్రైవేట్ ఇన్ స్టిట్యూషన్ లో యానిమేషన్ కోర్సు నేర్చుకుంటారు. అలాంటి కోర్సు ఫ్రీగా మన గురుకుల కాలేజీలో నేర్సుతున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే బిసీ గురుకుల ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. అడ్మిషన్ కోసం దరఖాస్తులు సీకరిస్తున్నారు.
ఇంటర్ పూర్తి చేసిన వారు ఈ నెల 31 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చని ఎం జె పి కార్యదర్శి బడుగు సైదులు తెలిపారు. ఇంటర్ విద్యార్హత కలిగి ఉన్న స్టూడెంట్స్ mjptbcwreis.telangana.gov.inలో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 9032644463, 9063242329 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని MJP కార్యదర్శి బడుగు సైదులు కోరారు.