
ఆర్టీసీలో త్వరలో ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. డ్రైవర్లు సహా వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. కొత్తబస్సుల కొనుగోలు తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలవుతుందని ఆదివారం (ఏప్రిల్ 20) ఆయన చెప్పారు.
త్వరలో మొత్తం 3 వేల 38 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు. వీటిలో 2 వేల డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ ఉద్యోగాలు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్), 114 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్), 25 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 18 అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ పోస్టులు, 23 అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్), 11 సెక్షన్ ఆఫీసర్ (సివిల్), 6 అకౌంట్ ఆఫీసర్స్, 7 మెడికల్ ఆఫీసర్స్ జనరల్, 7 మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్టులు ఉంటాయని చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
►ALSO READ | దేశంలో నం.1 పోలీస్ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి : డీజీపీ జితేందర్