భారత మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2021-- 2022 విద్యాసంవత్సరానికి గాను అర్హులైన మైనారిటీ (జైన్, బౌద్ధులు, సిక్కు, జోరాష్ట్రియన్లు, ముస్లిం, క్రిస్టియన్లు) అభ్యర్థుల నుంచి ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్స్ కు అప్లికేషన్స్ కోరుతోంది. అకడమిక్ మెరిట్, పుట్టినతేది, కుటుంబ వార్షిక ఆదాయం ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్స్
అర్హత: 1 నుంచి పదో తరగతి వరకు చదివే మైనారిటీ విద్యార్థులకి వీటిని అందిస్తారు. గతేడాది నిర్వహించిన ఫైనల్ ఎగ్జామ్లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. కుటుంబ వార్షికాదాయం ఏడాదికి లక్ష రూపాయలు మించరాదు. సెలెక్షన్ప్రాసెస్: అకడమిక్ మెరిట్ మార్కులు, వార్షికాదాయం ఆధారంగా ఎంపిక చేస్తారు.
పోస్ట్ మెట్రికల్ స్కాలర్‌షిప్స్
అర్హత: ప్రభుత్వ/ ప్రైవేటు కాలేజ్/ యూనివర్సిటీల్లో హయ్యర్ సెకండరీ చదివే మైనారిటీ విద్యార్థులకి ఈ స్కాలర్‌షిప్స్ అందిస్తారు. గతేడాది నిర్వహించిన ఫైనల్ ఎగ్జామ్లో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. పేరెంట్స్ వార్షికాదాయం ఏడాదికి రెండు లక్షల రూపాయలు మించకుండా ఉండాలి.
సెలెక్షన్ప్రాసెస్: అకడమిక్ మెరిట్ మార్కులు, వార్షికాదాయం ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రెండూ సమానమైతే పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకొని సీనియారిటీ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్స్
అర్హత: ప్రొఫెషనల్, టెక్నికల్ కోర్సులు చదివే పేద, ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులు అర్హులు. గతేడాది నిర్వహించిన తుది పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు/ తత్సమాన గ్రేడ్ సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం ఏడాదికి రూ.2.50 లక్షలు మించరాదు.
సెలెక్షన్ప్రాసెస్: అభ్యర్థుల మెరిట్, కుటుంబ వార్షికాదాయం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. స్కాలర్‌షిప్ మొత్తం: కోర్సు ఫీజు కింద ఏడాదికి రూ.20000, మెయింటెనెన్స్ అలవెన్స్ హాస్టలర్‌కి నెలకి రూ.1000, డేస్కాలర్‌కి నెలకి రూ.500 చెల్లిస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్
ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ దరఖాస్తులకి చివరి తేది: 15 నవంబర్ 2021
పోస్ట్ మెట్రిక్, మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్‌షిప్స్ దరఖాస్తులకి చివరి తేది: 30 నవంబర్ 2021
వెబ్సైట్ : www.minorityaffairs.gov.in