కొత్త బార్ల లైసెన్సులకు నోటిఫికేషన్.. అప్లికేషన్లకు 26వ తేదీ వరకు గడువు విధింపు

కొత్త బార్ల లైసెన్సులకు నోటిఫికేషన్.. అప్లికేషన్లకు 26వ తేదీ వరకు గడువు విధింపు

హైదరాబాద్, వెలుగు: వివిధ కారణాలతో మూతపడ్డ 40 బార్ల లైసెన్సులను రద్దు చేసి, కొత్త బార్లకు లైసెన్స్​ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్​ఇచ్చింది. పాత బార్ల స్థానంలో కొత్తవాటి ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకోవాలని అబ్కారీ కమిషనర్ చేవూరి హరికిరణ్  గురువారం నోటిఫికేషన్​ఇచ్చారు. ఈ నెల 26వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. జీహెచ్‌‌‌ఎంసీ పరిధిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున దరఖాస్తులను స్వీకరించడం లేదు. మిగిలిన  జిల్లాల్లో 25 బార్లకు నోటిఫికేషన్లు ఇచ్చారు.

మీర్ పేట్ మున్సిపాలిటీలో పాత బార్ స్థానంలో కొత్త బార్ ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతూ సరూర్‌ ‌‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉజ్వల రెడ్డి ఒక ప్రకటన ఇచ్చారు. దరఖాస్తు ఫీజు రూ.1 లక్ష కాగా, బార్ లైసెన్స్ ఫీజు రూ.42 లక్షలుగా నిర్ణయించారు.  అలాగే వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని కొడంగల్ మున్సిపాలిటీలో  పాత బార్ స్థానంలో కొత్త బార్ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ్ తెలిపారు. ఇక్కడ దరఖాస్తు ఫీజు రూ.1 లక్ష అని ఆయన పేర్కొన్నారు.