మహావీర్‌‌‌‌‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ మెడికోల రీఅలకేషన్‌‌‌‌కు నోటిఫికేషన్

మహావీర్‌‌‌‌‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ మెడికోల రీఅలకేషన్‌‌‌‌కు నోటిఫికేషన్

హైదరాబాద్ : అనుమతులు రద్దైన మహావీర్‌‌‌‌‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ మెడికల్ కాలేజీల స్టూడెంట్లను ఇతర కాలేజీల్లో సర్దుబాటు చేసేందుకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఒక్కో కాలేజీలో 150 చొప్పున, ఈ రెండు కాలేజీల్లో 300 మంది స్టూడెంట్లు ఉన్నారు. వీరిని రాష్ట్రంలోని 13 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సర్దుబాటు చేయనున్నారు. ఆయా కాలేజీల ఫీజు, సీట్ల సంఖ్య తదితర వివరాలను హెల్త్ యూనివర్సిటీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అందుబాటులో ఉంచారు. ప్రతి కాలేజీలో టీఆర్ఆర్, మహావీర్‌‌‌‌‌‌‌‌కు సమానంగా సీట్లు రిజర్వ్ చేశారు. నీట్‌‌‌‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు.

ఈ నెల 29న ఉదయం 9 నుంచి, మరుసటి రోజు సాయంత్రం 6 వరకు వెబ్‌‌‌‌ ఆప్షన్ల నమోదుకు గడువు ఇచ్చారు. కిందటేడు రెగ్యులర్ కౌన్సెలింగ్ సమయంలో వినియోగించిన లాగిన్ ఐడీ వివరాలతోనే లాగిన్‌‌‌‌ అవ్వాలని సూచించారు. ఒకవేళ ఏవైనా ఇబ్బందులు ఉంటే 78425 42216, 90596 72216 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. వసతులు లేవని, ఈ రెండు కాలేజీలతో పాటు ఎంఎన్‌‌‌‌ఆర్ మెడికల్ కాలేజీ పర్మిషన్‌‌‌‌ను కూడా నేషనల్ మెడికల్ కమిషన్ రద్దు చేసింది. మహావీర్‌‌‌‌‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌కు సంబంధించిన తుది అప్పీల్స్‌‌‌‌ను కూడా ఎన్‌‌‌‌ఎంసీ తిరస్కరించిందని, ఎంఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి మరో నాలుగైదు రోజుల్లో నిర్ణయం వస్తుందని హెల్త్ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

కాలేజీల వారీగా సీట్ల వివరాలు

  • చల్మెడ ఆనందరావు - 28
  • కామినేని (నార్కట్ పల్లి) - 28
  • మల్లారెడ్డి - 28
  • మల్లారెడ్డి (వుమెన్) - 28
  • ప్రతిమ - 28
  • అపోలో - 20
  • భాస్కర్ - 20
  • కామినేని (ఎల్బీ నగర్ ) - 20
  • మమత (బాచుపల్లి) - 20
  • మమత (ఖమ్మం) - 20
  • ఎస్ వీఎస్ - 20
  • మెడిసిటీ - 20
  • ఆర్వీఎం - 20