హైదరాబాద్ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర సర్కార్. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది.. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్. 16 వేల 27 పోస్టులు భర్తీ చేస్తామని తెలిపింది. ఇందులో ఎస్ఐ, కానిస్టేబుల్, స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్, జైలు వార్డెన్లు, పైర్ మెన్ పోస్టుల భర్తీ ఉంటుందని చెప్పింది బోర్డ్. వచ్చే నెల 2 నుంచి 20వ తారీఖు వరకు ఆన్ లైన్ లో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని తెలిపింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు. 80వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం ప్రకటించిన తర్వాత వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ ఇది.