బీటెక్, ఎంటెక్ అర్హతతో బెల్​లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు

బీటెక్, ఎంటెక్ అర్హతతో బెల్​లో సీనియర్ ఇంజినీర్ పోస్టులు

సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం భారత్ ఎలక్ట్రానిక్స్(బీఈఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల​అభ్యర్థులు మే 19వ తేదీలోగా ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

  • పోస్టులు: 7 (సీనియర్ ఇంజినీర్)
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి వీఎల్ఎస్ఐ డిజైన్ లేదా మైక్రో ఎలక్ట్రానిక్స్​లో ఎంఈ లేదా ఎంటెక్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్​లో బీఈ లేదా బీటెక్, మెకానికల్ ఇంజినీరింగ్​లో బీఈ లేదా బీటెక్​లో ఉత్తీర్ణ సాధించి ఉండాలి. 
  • వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 32 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
  • అప్లికేషన్ లాస్ట్ డేట్: మే 19.
  • అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఇతరులకు రూ.600. 
  • సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్షలో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను 1: 5 నిష్పత్తిలో ఇంటర్వ్యూ ఎంపిక చేస్తారు. 15 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ కార్యాలయంలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు  hrpdicrec@bel.co.inలో  సంప్రదించగలరు.