దేశవ్యాప్తంగా ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో 195 సబ్జెక్ట్ మేటర్ స్పెషలిస్ట్(ఎస్‌ఎంఎస్), సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(ఎస్‌టీవో) పోస్టుల భర్తీతో పాటు జాతీయ అర్హత పరీక్ష(నెట్)-2023 నిర్వహణకు సంబంధించి న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఏఎస్‌ఆర్‌బీ) ఉమ్మడి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
అర్హత:
సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. నెట్‌కు21 ఏళ్ల నిండి ఉండాలి. నెట్, ఎస్‌ఎంఎస్, ఎస్‌టీవో-2023 ఉత్తీర్ణత మార్కులు: యూఆర్ అభ్యర్థులకు 75.0 (50%), ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ 67.5 (45%), ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 60.0 (40%).
సెలెక్షన్:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎస్‌ఎంఎస్, ఎస్‌టీవో ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 22 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.asrb.org.in వెబ్సైట్లో సంప్రదించాలి.