సీఎస్ఐఆర్లో డిగ్రీ అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్​ఉద్యోగాలు..

సీఎస్ఐఆర్లో డిగ్రీ అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్​ఉద్యోగాలు..

టెక్నికల్​ అసిస్టెంట్​ఉద్యోగాల భర్తీకి సీఎస్ఐఆర్ నేషనల్​ ఏరోనాటిక్స్​లాబొరేటరీస్, బెంగళూరు నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్​ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పోస్టులు 36: టెక్నికల్ అసిస్టెంట్

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ, మెకానికల్, కెమికల్, కంప్యూటర్​ సైన్స్, సివిల్, మెటలర్జీ విభాగంలో డిప్లొమా, మల్టీమీడియా యానిమేషన్, ఫిజిక్స్ లో బీఎస్సీ గ్రాడ్యుయేషన్​ ఉత్తీర్ణత.
అప్లికేషన్ ​ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడ్ల్యూఎస్​ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

లాస్ట్​ డేట్: ఏప్రిల్​ 11. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ట్రేడ్​ టెస్ట్​ ఆధారంగా ఎంపిక చేస్తారు. ​

ALSO READ : డిగ్రీ చదివారా..? కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా..? అర్జెంట్గా ఈ జాబ్స్కు అప్లై చేసుకోండి..