ఫోటోగ్రాఫర్ ఖమ్మం, వెలుగు: కేంద్ర ఎన్నికల కమిషన్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం ప్రకటించడంతో ఆయా పార్టీల ప్రచార ఫ్లెక్సీ లకు ఎన్నికల నిబంధనల మేరకు ముసుగు వేశారు. ఖమ్మం నగరంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన లీడర్ల కటౌట్స్, హోర్డింగ్ లను డీఆర్ఎఫ్ బృందం తొలగించింది.
ఇప్పటివరకు ప్రజలను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను,ఆయా పార్టీల ప్రచార వాల్ పోస్టర్లను, వాల్స్ పై వేసిన పెయింటింగ్ లను ఎన్నికల రిటర్నింగ్ అధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది తొలగించే పనిలో పడ్డారు.