
బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ లో అడ్మిషన్లపై ప్రకటన విడుదల చేశారు అధికారులు. అసక్తి కల విద్యార్ధులు ఆన్‌లైన్‌లో https://www.rgukt.ac.in/ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ నెల ఒకటి నుంచి అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లు పెట్టుకోవచ్చని తెలిపారు అధికారులు. మీసేవ లేదంటే యూనివర్సిటీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్పారు. జూన్ 22 వరకు దరఖాస్తుల స్వీకరణకు లాస్ట్ డేట్ అని చెప్పారు. కాగా.. ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో అడ్మిషన్ పొందితే.. రెండేండ్ల ఇంటర్ తో పాటు నాలుగేండ్ల ఇంజినీరింగ్ కోర్సు చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్ సైట్ లేదా ఇమెయిల్(admissions@rgukt.ac.in) ద్వారా సంప్రదించవచ్చు.