గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ బై ఎలక్షన్​కు నోటిఫికేషన్​ రిలీజ్

గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ బై ఎలక్షన్​కు నోటిఫికేషన్​ రిలీజ్

 

  • మే  9 వరకు నల్గొండ కలెక్టరేట్​లో నామినేషన్ల స్వీకరణ​

హైదరాబాద్, వెలుగు: నల్గొండ, వరంగల్‌‌‌‌, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌‌ విడుదలైంది. గురువారం ఉదయం నోటిఫికేషన్‌‌ రిలీజ్ కాగా.. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్‌‌ ఉమ్మడి జిల్లాల్లోని మొత్తం 12 కొత్త జిల్లాలతో కూడిన ఈ  గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నల్గొండ కలెక్టరేట్‌‌లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. 

ఈ నెల 9 నామినేషన్ల సమర్పణకు ఆఖరి తేదీ. 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 27న పోలింగ్‌‌.. జూన్‌‌ 5న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ స్థానంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో  ఖాళీ అయింది. దీంతో అక్కడ బై ఎలక్షన్​కు ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్​ రిలీజ్​చేసింది. కాగా.. ఈ స్థానంలో కాంగ్రెస్​ పార్టీ తరఫున తీన్మార్​ మల్లన్న పోటీ చేస్తున్నారు. గతంలోనూ ఆయన ఈ స్థానంలో పోటీ చేశారు.