
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5008 జూనియర్ అసోసియేట్స్(క్లర్క్) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. హైదరాబాద్ సర్కిల్‌లో 225 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: మొత్తం 5008 జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్/ చివరి సెమిస్టర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
సెలెక్షన్: ఆన్‌లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్ జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు.. 30 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు... 35 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు... 35 మార్కులకు జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్స్‌కు ఎంపికవుతారు. మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి.
అర్హత:అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 27 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి. ప్రిలిమ్స్ నవంబర్ 2022లో జరుగుతుంది. మెయిన్స్ డిసెంబర్ 2022/ జనవరి 2023లో జరుగుతుంది. పూర్తి వివరాలకు www.sbi.co.in వెబ్సైట్లో సంప్రదించాలి.
స్పెషలిస్ట్ ఆఫీసర్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచీల్లో 714 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (ఎస్‌సీఓ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, పీజీ ఉండాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 2 ఏళ్లు నుంచి 12 ఏళ్ల పని అనుభవం ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా సెప్టెంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ. 750 చెల్లించాలి.