- అప్లికేషన్‌కు 22 వరకు గడువిస్తూ నోటిఫికేషన్ జారీ
హైదరాబాద్, వెలుగు: కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి కొత్త వీసీ రాబోతున్నారు. ఈ మేరకు వీసీ పోస్టు భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వాని స్తూ రాష్ట్ర సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుదారులకు కనీసం రెండేండ్లపాటు ఏదైనా మెడికల్ కాలేజీకి డీన్‌గా లేదా ప్రిన్సిపా ల్‌గా పనిచేసిన అనుభవంతో పాటు, కనీసం పదేండ్లు అకడమిక్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని స్పష్టం చేసింది. వయసు 67 సంవత్సరాల లోపు ఉండాలని తెలిపింది. పూర్తి వివరాలతో ఈ నెల 22వ తేదీ లోపల దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ ద్వారా సెక్రటేరియెట్‌లోని హెల్త్ సెక్రటరీ కార్యాలయానికి పంపించాలని సూచిం చింది.
దరఖాస్తుల స్వీకరణ అనంతరం వాటి స్క్రూటినీకి కమిటీ వేయనున్నారు. ఆ తర్వాత సెర్చ్ కమిటీ వేసి, ముగ్గురి పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేస్తారు. అందులో నుంచి ఒకరిని వీసీగా ఎంపిక చేస్తారు. ఉమ్మడి ఏపీలో ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోనే అన్ని మెడికల్ కాలేజీలు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత 2015లో వరంగల్‌లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. కరుణాకర్ రెడ్డిని వీసీగా అప్పటి సర్కార్ నియమించింది. ఆ తర్వాత ఆయన పదవీకాలం అయిపోయిన కొద్దీ పొడిగిస్తూ వచ్చారు. నాటి నుంచి నేటి వరకు ఆయనే వీసీగా కొనసాగుతూ వస్తున్నారు.