నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​ : నైపర్​లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​ :  నైపర్​లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​

వివిధ  విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అహ్మదాబాద్​లోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఫార్మాస్యూటికల్​ ఎడ్యుకేషన్​ అండ్​ రీసెర్చ్(నైపర్ అహ్మదాబాద్) నోటిఫికేషన్​ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టులు 11: అసిస్టెంట్ ప్రొఫెసర్ ​4, అసోసియేట్​ ప్రొఫెసర్ 2, ప్రొఫెసర్ 5.
డిపార్ట్​మెంట్స్: ఫార్మాస్యూటికల్​ఎనలైసిస్, ఫార్మాస్యూటిక్స్, ఫార్మకాలజీ అండ్​ టాక్సికాలజీ, మెడికల్​ డివైసెస్, మెడికల్​ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్​డీలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: అసిస్టెంట్​ ప్రొఫెసర్​కు 40 ఏండ్లు, అసోసియేట్​ ప్రొఫెసర్​కు 45 ఏండ్లు,  ప్రొఫెసర్​కు 50 ఏండ్లు ఉండాలి. 
అప్లికేషన్ విధానం: ఆన్​లైన్​
లాస్ట్​ డేట్: మార్చి 23.
సెలెక్షన్​ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ​