నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆల్ ఇండియా ఆయుష్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది; అర్హత: బీఏఎంఎస్/ బీయూఎంస్/ బీఎస్ఎంఎస్/ బీహెచ్ఎంస్ ఉత్తీర్ణత; సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్; దరఖాస్తులు: ఆన్లైన్; చివరితేది: 21 ఆగస్టు; వెబ్సైట్: www.aiapget.nta.ac.in
ఏపీపీఈసెట్
ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీఈసెట్) నోటిఫికేషన్ గుంటూరులోని ప్రొఫెసర్ నాగార్జున యూనివర్సిటీ విడుదల చేసింది; కోర్సులు: బీపీఈడీ (రెండేళ్లు), యూజీడీపీఈడీ (రెండేళ్లు); సెలెక్షన్ ప్రాసెస్: ఎంట్రన్స్ ఎగ్జామ్; దరఖాస్తులు: ఆన్లైన్; అప్లికేషన్స్ ప్రారంభం: 6 ఆగస్టు; వెబ్సైట్: www.sche.ap.gov.in
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు
హైదరాబాద్‌లోని టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగం (డీటీఈ) ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది; కోర్సులు: డీఈఈఈ, డీసీఈ, డీఈసీఈ, డీఎంఈ/డీఏఈ, డీజీటీ, డీసీఎంఈ; అర్హత: ఇంటర్ (ఒకేషనల్)తో పాటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బ్రిడ్జ్ కోర్సు ఉత్తీర్ణత; దరఖాస్తులు: ఆఫ్‌లైన్; అడ్రస్: ప్రిన్సిపల్, జేఎన్ ప్రభుత్వ పాలిటెక్నిక్, రామాంతపూర్, హైదరాబాద్ 500013; చివరితేది: 10 ఆగస్టు; వెబ్సైట్: www.dtets.cgg.gov.in
ఎన్ఐపీహెచ్ఎంలో డిప్లొమా, పీజీ డిప్లొమా
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (ఎన్ఐపీహెచ్ఎం) డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు అప్లికేషన్స్ కోరుతోంది; కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ప్లాంట్ హెల్త్; సెలెక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష; దరఖాస్తులు: ఆన్లైన్; చివరితేది: 16 ఆగస్టు; వెబ్సైట్: niphm.gov.in
ఐఐటీల్లో ఎమ్మెస్సీ, డ్యుయల్ డిగ్రీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఎమ్మెస్సీ, ఇతర డ్యుయల్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్)–2022 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది; అర్హత: కనీసం 55 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత; సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్; దరఖాస్తులు: ఆన్లైన్; అప్లికేషన్స్ ప్రారంభం: 30 ఆగస్టు; చివరితేది: 11 అక్టోబర్; ఎగ్జామ్: 13 ఫిబ్రవరి 2022; వెబ్సైట్: www.jam.iitr.ac.in