టెన్నిస్ దిగ్గజ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొనేందుకు మెల్ బోర్న్ వెళ్లిన జకోవిచ్ వీసాను ఆస్ట్రేలియా బోర్డర్ ఫోర్స్ అధికారులు రద్దు చేశారు. కరోనా వ్యాక్సిన్ వివరాలు సమర్పించకపోవడం వల్లే వీసాను రద్దు చేశామని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం అర్దరాత్రి మెల్బోర్న్లోని తుల్లామరైన్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జకోవిచ్‌ను అధికారులు అడ్డుకోవడంతో ప్రస్తుతం మెల్ బోర్న్ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ ఫెసిలిటీలో ఉన్నాడు. కరోనా టీకాలు వేసుకోకున్నా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు జకోవిచ్ అనుమతితో పాటు వైద్యపరమైన మినహాయింపును కూడా పొందాడు. అయినా ఆస్ట్రేలియా ప్రభుత్వం మాత్రం రూల్ ఈజ్ రూల్ అంటూ జకోవిచ్‌ను అడ్డుకుంది. ఆస్ట్రేలియాలో ప్రవేశానికి జకోవిచ్ తగిన సాక్ష్యాలు అందించడంలో విఫలమయ్యాడని, అందుకే వీసాను రద్దు చేశామని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ అన్నారు. రూల్ ఈజ్ రూల్, ఎవరికీ ప్రత్యేక నిబంధనలు లేవు అని ఆయన అన్నారు. కాగా.. జకోవిచ్ ను అడ్డుకోవడంపై సెర్బియా ప్రెసిడెంట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడితో ఇలాగేనా వ్యవహరించేదని మండిపడ్డారు. జకోవిచ్ వీసాను పునరుద్దరించాలని ఆయన తరపున లాయర్లు కోర్టులో అప్పీలు చేశారు. అయితే, ఆస్ట్రేలియన్ ఓపెన్ కిరీటాన్ని సాధించి.. తన ఖాతాలో 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ వేసుకోవాలనుకున్న జకోవిచ్ కల నెరవేరుతుందో లేదో చూడాలి.
For More News..
మా నాన్న ఎంపీటీసీ.. నన్నే ఆపుతారా?